CM Vijay Governance Reform: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే విమర్శలను సానుకూలంగా స్వీకరిస్తూ, తప్పులను సరిదిద్దుకుంటూ ఆయన సాగిస్తున్న పయనం అందర్నీ ఆకట్టుకుంటోంది.

రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కోవడం వేరు, వాటిని గౌరవించి మార్పులు చేయడం వేరు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రెండవ రకానికి చెందిన నేత అని నిరూపించుకుంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్ వెళ్తుంటే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోవడం, సామాన్యులు గంటల తరబడి వేచి చూడటం మనం చూస్తుంటాం. అయితే, తన వల్ల ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు కలగకూడదని విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది.

ఇటీవల విజయ్ కాన్వాయ్ కదలికల వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీనిపై నెటిజన్ల నుండి, సామాన్య ప్రజల నుండి వచ్చిన విమర్శలను ముఖ్యమంత్రి ఏమాత్రం తప్పుగా తీసుకోలేదు. ప్రజల అసౌకర్యాన్ని విమర్శగా చూడవద్దు.. అది మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన సూచనగా భావించాలి అని ఆయన తన అధికారులకు స్పష్టం చేశారు. ఒక ప్రజా నాయకుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవాలనే సూత్రాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు శాఖ సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సమాంతర ట్రాఫిక్ నిర్వహణ విధానాన్ని చేపట్టారు. అంటే ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే సమయంలోనే, సామాన్యుల వాహనాల ప్రవాహం ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను . సిగ్నల్ టైమింగ్స్‌ను సమన్వయం చేస్తున్నారు. దీనివల్ల కాన్వాయ్ వెళ్లిన సెకన్ల వ్యవధిలోనే ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంటోంది.

ప్రభుత్వ పర్యటనల వల్ల సామాన్యుల పనులకు ఆటంకం కలగకూడదని టీవీకే అధినేత గట్టిగా నమ్ముతున్నారు. అత్యవసర సేవలు, అంబులెన్స్‌లు . పాఠశాల బస్సులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజల నుండి వచ్చే ప్రతి కన్స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ను క్రీడాస్ఫూర్తితో తీసుకుని రెక్టిఫై చేస్తుండటం విజయ్ పాలనలోని పాజిటివ్ అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

. @CMOTamilnadu is taking all the constructive feedback sportively and rectifying the shortcomings.

As per the directives of the Chief Minister @TVKVijayHQ , comprehensive parallel traffic arrangements were put in place throughout the convoy movement to ensure smooth traffic… pic.twitter.com/z0v46dYjU8

— Rajasekar (@sekartweets) May 16, 2026

గతంలో ముఖ్యమంత్రులు వస్తున్నారంటే సైరన్లు, పోలీసుల విజిల్స్‌తో హడావుడి ఉండేది. ఇప్పుడు విజయ్ పాలనలో ఆ హడావుడి తగ్గింది. ప్రజల మధ్యలో ఒకడిగా ఉంటూనే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు వారి సౌకర్యాలను విస్మరించకూడదనే విధానాన్ని ఆయన అమలు చేస్తున్నారు. ఈ మార్పు కేవలం ట్రాఫిక్ నిర్వహణలోనే కాదు, త్వరలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా ప్రతిబింబిస్తుందని కేడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. విమర్శలను స్వీకరించే మనస్తత్వమే విజయ్‌ను ఒక పరిణతి చెందిన నాయకుడిగా నిలబెడుతోంది.