Vedamurti Devavrat Mahesh Rekhe: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన 19 ఏళ్ల యువ వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేక్హే పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖకు చెందిన 2000 మంత్రాల 'దండక్రమ పారాయణం'ను 50 రోజుల్లో పూర్తి చేశాడు ఈ యువకుడు. ఇలా 200 సంవత్సరాల తర్వాత మొదటిసారి సాధించిన ఘనతగా చెబుతున్నారు. ఈ యువకుడి పట్టుదల , గురు పరంపర, సంస్కృతి ఆకాంక్షలకు ప్రతీకగా మారిన ఈ సంఘటన ప్రధానమంత్రి మోదీని కూడా మెప్పించింది.

19 ఏళ్ల దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారతీయ సంస్కృతిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీ దేవవ్రత్ శుక్ల యజుర్వేదంలోని మధ్యందిన శాఖ యొక్క 2,000 మంత్రాల పారాయణం అయిన "దండకర్మ పారాయణం"ను 50 రోజుల పాటు అంతరాయం లేకుండా పూర్తి చేశారని తెలుసుకుని సంతోషిస్తారన్నారు. ఇందులో అనేక వేద శ్లోకాలు, పవిత్ర పదాలు ఉన్నాయి, వీటిని ఆయన సంపూర్ణ స్వచ్ఛతతో పఠించారు. ఈ విజయం మన గురు సంప్రదాయం యొక్క అత్యున్నత అభివ్యక్తిని సూచిస్తుందన్నారు.

వారణాశీ పార్లమెంటు సభ్యుడిగా, ఈ పవిత్ర భూమిపై ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన సాధించినందుకు నేను గర్విస్తున్నాను. ఈ తపస్సులో ఆయనకు మద్దతు ఇచ్చిన ఆయన కుటుంబం, సాధువులు, ఋషులు, పండితులు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు నేను నమస్కరిస్తున్నాననని అన్నారు.

దేవవ్రత్ మహేష్ రేక్హే (19) కాశీలోని ప్రముఖ వేద పాఠశాలలో చదువుతున్ారు. తండ్రి మహేష్ రేక్హే, తల్లి దేవీ రేక్హేలకు ఇద్దరు సంతానంలో ఒకరు. చిన్నప్పటి నుంచి వేదాలు, శాస్త్రాలపై ఆసక్తితో ఆయన శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖపై పట్టు సాధించారు. కాశీలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతంలోని ఒక గురుకులంలో ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఈ గురుకులంలో 5 సంవత్సరాలుగా శిక్షణ పొందిన దేవవ్రత్, మరో 2 సంవత్సరాలుగా 'దండక్రమ పారాయణం'కు సిద్ధమయ్యారరు.

19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है।

भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o

— Narendra Modi (@narendramodi) December 2, 2025

ఆయన గురువులు, స్థానిక సంస్కృతి పండితులు ప్రకారం, దేవవ్రత్ చిన్నప్పుడు నుంచి ఒక్క సారి వింటే మంత్రాలు గ్రహించే స్వాభావిక ప్రతిభ ఉన్న వ్యక్తి. కాశీలోని ఈ యువకుడు, తన సాధనలో భాగంగా రోజుకు 8-10 గంటలు పారాయణం చేస్తూ, ఆహారం, నిద్రలో కూడా క్రమశిక్షణ పాటించాడు. ఈ సాధనకు భారతదేశం అంతటా వచ్చిన సాధువులు, పండితులు, సంస్థలు మద్దతు ఇచ్చాయి.