'వారణాసి' విడుదలైన తర్వాత భారత దేశమంతా గర్వపడుతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చెప్పారు. 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' (ఇంతకు ముందు టైటిల్ అనౌన్స్ చేయడానికి ఎప్పుడూ ఇటువంటి ఈవెంట్ చేయలేదు. ఇకపై చేయలేరు ఏమో కూడా) అన్నట్టు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సాగింది. టైటిల్ గ్లింప్స్‌లో కంటెంట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విడుదల చేసేలా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్లాన్ చేస్తున్నారు. ఈ స్థాయి సినిమా ఈవెంట్‌లో టోటల్ టీమ్ మాటల్లో పూరి జగన్నాథ్ వినిపించారు. అది గమనించారా?

'వారణాసి'లో పూరి జపం...
'వారణాసి' ఈవెంట్‌లో... మెయిన్ టీమ్ నుంచి మొదట మాట్లాడినది ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి. ఆయన స్పీచ్ మీద దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రభావం బలంగా పడింది. 'వారణాసి' విడుదల తేదీ వెల్లడించడానికి 'పోకిరి'లో మహేష్ బాబు డైలాగ్ రీ క్రియేట్ చేశారు కీరవాణి.

మహేష్ బాబు అభిమానుల్లో గుండెల్లో ఫ్లాట్ కొన్నానని చెప్పారు. గృహప్రవేశం 2027 వేసవిలో అని చెప్పారు. ''బిల్డ‌ర్ హ్యాండ్ ఓవర్ చేసేశాడు. ప్రొడ్యూస‌ర్ హ్యాపీ. డైరెక్ట‌ర్ హ్యాపీ. టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే... బీటూ నాదే...'' అంటూ చెప్పుకొచ్చారు. 'శృతి నాదే... గన్ను నాదే' అంటూ మహేష్ టైపులో చెప్పారు. కీరవాణి తర్వాత స్టేజిపైకి వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ తాను థియేటర్‌లో చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పోకిరి' అన్నారు. మలయాళ స్టార్ హీరోని 'పోకిరి' థియేటర్లకు రప్పించింది అన్నమాట.

మహేష్... మైండ్ బ్లాక్!
'వారణాసి' చిత్రానికి దర్శకుడు దేవా కట్టా డైలాగులు రాస్తున్నారు. 'మహేష్ బాబు సినిమాల్లోని డైలాగుల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏది?' అని యాంకర్ సుమ కనకాల అడిగితే... 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు' అని 'పోకిరి' డైలాగ్ చెప్పారు ఆయన. యాజిటీజ్ డైలాగ్ చెప్పలేదు కానీ మహేష్ మాటల్లోనూ 'పోకిరి' ప్రభావం స్పష్టంగా కనిపించింది.

Also Read: లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరోలు లాస్టులో మాట్లాడటం కామన్. మహేష్ బాబు సైతం 'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌ ఈవెంట్‌లో అందరి కంటే లాస్ట్ మాట్లాడారు. ఆయన స్పీచ్ చిన్నగా ఉంది. కానీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. 'అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా! ఎలా ఉంది? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది నాక్కూడా' అంటూ 'పోకిరి'లో డైలాగును కాస్త మార్చి చెప్పారు.

'వారణాసి'... ఇది పూరి జగన్నాథ్ సినిమా కాదు. ఈవెంట్‌కు ఆయన రాలేదు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరి మాటల్లో పూరి జగన్నాథ్ వినిపించారు. ఆయన పెన్ను పవర్ అటువంటిది. పూరి జగన్నాథ్ ఫోటోను మొబైల్ స్క్రీన్‌లో పెట్టుకున్న విజయేంద్ర ప్రసాద్, హీరోయిన్ ప్రియాంక చోప్రాలు పూరి ప్రస్తావన లేకుండా తమ తమ స్పీచ్ ముగించారు. డైలాగులతో హీరోయిజం ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ రూటే సపరేట్. ఆయనకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అది సెలబ్రిటీల మాటల్లోనూ వినిపించింది. ఇప్పుడు పూరి అభిమానులు అందరూ కోరుకునేది ఒక్కటే... పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.

Also Read: 'వారణాసి'లో రుద్రుడిగా మహేష్ బాబు - చేతిలో త్రిశూలం... నందిపై శివుడి సంచారం... ఈ 'GlobeTrotter' వేరే లెవల్...