RR Playoff Hopes on Vaibhav: IPL 2026 లీగ్... ఆఖరి లెగ్‌లోకి వచ్చేసింది. చివరకు చివరి లీగ్‌ మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ కాలేదు. ఆదివారం జరిగే రెండు లీగ్ మ్యాచ్‌లు ప్లేఆఫ్‌ లిస్టులో చివరి బెర్త్‌ను కన్ఫామ్ చేస్తాయి. అందులో మొదటి మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్ - ముంబై ఇండియన్స్‌తో ఆడుతోంది. ఇప్పటికే అస్సాం టికెట్ తీసుకుని బయటకెళ్లిపోయిన ముంబైకి ఈ మ్యాచ్‌తో వచ్చేది పోయేదేం లేదు. కాకపోతే సొంత గ్రౌండ్‌లో పరువు నిలుపుకోవడానికి .. పాయింట్స్ టేబుల్‌లో మరీ అట్టగున లేకుండా ఉండటానికి మాత్రమే తాపత్రయం. కానీ రాజస్థాన్‌కు అాలా కాదు. ఈ మ్యాచ్‌ వాళ్లకి Do or Die. ఈ మ్యాచ్‌లో గెలిస్తే... వాళ్లు ప్లే ఆఫ్‌కు వెళతారు.

రాజస్థాన్‌ విన్నింగ్ కార్డ్ వైభవే..

ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌ తమ ఆశలన్నంటినీ 15ఏళ్ల వైభవ్‌ పైన పెట్టుకుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో రాజస్థాన్ ఈ మాత్రం నిలబడగలిగిందంటే అతని వల్లనే. మొత్తం టీమ్ అతనిపైన డిపెండ్ అయిందన్న విషయం వినడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కానీ... స్టాటిస్టిక్స్‌ చెబుతోందదే. RR గెలిచిన మ్యాచ్‌లలో నాలుగోవంతు పరుగులు వైభవ్ చేసినవే. అతను ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 579పరుగులు చేశాడు. అందులో 344పరుగులు RR గెలిచిన 7 మ్యాచ్‌లలో చేశారు. అంటే సగటు దాదాపు 50పరుగులు. అంతే కాదు.. RR మొత్తం పరుగుల్లో వైభవ్ చేసినవి 26శాతం పరుగులు. సో... దీనిని బట్టే వైభవ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
గెలిచిన మ్యాచ్‌లలో మాత్రమే కాదు... RR ఓడిపోయిన వాటిలో వైభవ్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ౩6 బంతుల్లోనే సెంచరీ కొట్టిన మ్యాచ్‌ను RR బౌలర్లు కాపాడలేకపోయారు.

బ్యాటర్ మాత్రమే కాదు మ్యాచ్‌ విన్నర్.

వైభవ్ ఏదో ప్లూక్‌లో వచ్చి.. నాలుగు సిక్స్‌లు ఊపి వెళ్లిపోతున్న రకం కాదు. RR గెలుపులో అతని భాగస్వామ్యం ఎంతో చెప్పడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. వైభవ్‌లాగా ఈ సీజన్‌లో ఎక్కువ పరుగుల విన్నింగ్ కంట్రిబ్యూషన్ చేసినవాళ్లు చాలా తక్కువ. గుజరాత్‌ గెలుపుల్లో సాయి సుదర్శన్ , చెన్నై గెలిచింది తక్కువే అయినా వాటిలో సంజు శాంసన్, RCB గెలుపుల్లో విరాట్ కోహ్లీ మాత్రమే కనిపిస్తారు. కానీ వీళ్లకన్నా.. సూర్యవంశీ చాలా స్పెషల్ ఎందుకంటే. మ్యాచ్‌ గెలుపుకోసం అవసరమైన క్విక్ స్టార్ట్ వైభవ్ ఇచ్చేస్తాడు. పవర్‌ ప్లే కి ముందే కనీసం 70 పరుగులు బోర్డుపై ఉంచి..టీమ్‌కు ఓ భరోసా కల్పిస్తాడు. ఇక మిగిలిన వాళ్లు దానిని కూడా వినియోగించుకోలేకపోతే చేయగలిగిందేం లేదు కానీ.. అతను టీమ్ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టాడు. సూర్యవంశీ Strike Rate 245 పైన ఉంది. IPLలో అదే హయ్యస్ట్. ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడే కాదు.. చేజింగ్‌లో కూడా అతను టీమ్‌కు బ్యాక్‌బోన్‌లా నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చేజింగ్‌లోనే అతని స్ట్రైక్‌రేట్ ఎక్కువుంది. చేజింగ్ టైమ్‌లో చాలా తొందరగానే పెద్ద స్కోర్‌లు చేసి మిగిలిన వారిపై భారాన్ని తగ్గిస్తున్నాడు. మొన్న వరుసగా ముూడు మ్యాచ్‌లు ఓడిపోయి.. ఇక ప్లే ఆఫ్‌ వదిలేసుకోవాలనుకున్న తరుణంలో 38 బంతుల్లో 93 పరుగులు చేసి 221 పరుగుల చేజ్‌ను సింపుల్ చేశాడు. సో ఇప్పుడు టీమ్‌కు అవసరమైన ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో వైభవ్ ఏం చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం RRలో అతను తప్ప ఇంకెవరూ మ్యూచ్‌ను కాపాడేవాళ్లు కనిపించడం లేదు. జైస్వాల్ వైభవ్‌తో కలిసి మొదట్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు. ధృవ్ జురేల్ స్టైక్ రేట్ తక్కువుగా ఉంటోంది. మిగిలిన వాళ్లలో ఎవరు ఎప్పుడు ఆడతారో తెలీదు.

Vaibhav vs Bumrah

ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా పోరు ఉంటుందనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా తనకు వేసిన ఫస్ట్ బాల్‌నే సిక్సర్ బాది వైభవ్ అందరినీ షాక్‌కు గురి చేశాడు. బుమ్రా కూడా ఊహించని ఎటాక్ అది. ఈ సీజన్‌ మొత్తం పేలవమైన ఫామ్‌లో ఉన్న బుమ్రా కనీసం చివరి మ్యాచ్‌లో అయినా తన స్థాయికి తగ్గ పర్‌ఫార్మెన్స్ ఇవ్వాలని ఫీలైతే కనుక మంచి రసవత్తరమైన మ్యాచ్‌ చూడొచ్చు.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఒక పీడకలలా సాగింది. స్టార్ ప్లేయర్ల గాయాలు, బ్యాటర్లు, బౌలర్ల పేలవ ఫామ్ ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాయి. టోర్నీ ఆరంభంలో 'వరల్డ్ XI'లా కనిపించిన ముంబై, ఇప్పుడు పట్టికలో చివరి స్థానంలో నిలిచే ప్రమాదంలో పడింది. ఇప్పుడు పరువు నిలుపుకోవడానికైనా వాళ్లు గట్టిగానే నిలబడతారు.