Manchu Manoj Satirical Comedy Trending In Vaddi Kaasula Vaada Movie : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) బర్త్ డే సందర్భంగా రిలీజైన కొత్త మూవీ 'వడ్డీ కాసుల వాడ' టైటిల్ గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది. తన కెరీర్‌లో హిట్ మూవీ బిందాస్ తర్వాత అదే బ్యానర్‌లో అలాంటి జానర్‌లో రాబోతోన్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, రెంట్స్, ఈఎంఐలు అన్నింటినీ ఫన్ జానర్‌లో ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే సెటైరికల్ కామెడీ కూడా ఆకట్టుకుంటోంది. మంచు మనోజ్ ఏడు కొండల వాడిని వేడుకుంటూ... 'స్వామీ... ఒకటో తేదీ వస్తే చాలు... ఇటు బిల్లులు అటు ఈఎంఐలు కట్టాలని కాల్స్... కట్టకపోతే రిమైండర్స్. అప్పులోళ్ల తియ్య తియ్యని మాటలు.

తప్పించుకోడానికి నేను పడే పాట్లు. ఇంక నేను చేయలేను స్వామీ ఈ ఫైట్లు. అందుకే ఈసారి ఫైట్స్‌తో కాకుండా ఫన్‌తో మీ దగ్గరికి వస్తున్నా. మన సినిమా బీభత్సమైన హిట్ చేసే బాధ్యత నీదే స్వామీ.' అంటూ చెప్పే ఓపెనింగ్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

డైలాగ్ ట్రెండింగ్

'స్వామీ... ఏదో ఒకటి చేసి వచ్చే పుట్టిన రోజుకు జంబానీ లాంటి లైఫ్ ఇస్తే... బిందాస్‌గా హెలికాఫ్టర్‌లో తిరుపతికి వచ్చి నీ అప్పు కూడా తీర్చేస్తా. అప్పుడు అదే తిరుపతిలో ఒక అద్భుతమైన కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టిల్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఇచ్చేస్తా. అదే హృదయంతో అందరినీ కాపాడు స్వామీ. వడ్డీలు కట్టలేక చస్తూ బతికే ప్రతీ వాళ్లకు ఈ మన సినిమా అంకితం.' అంటూ మనోజ్ చెప్పే డైలాగ్ ట్రెండ్ అవుతోంది. అలా ఫైనల్‌గా 'వడ్డీ కాసుల వాడా' (Vaddi Kaasula Vaada) అంటూ టైటిల్ రివీల్ చేశారు.

Also Read : 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

సెటైర్ వేశారా?

'తిరుపతిలో కాలేజీ కట్టి... 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తా' అనే డైలాగ్ సెటైరికల్‌గా వేశారా? అంటూ మనోజ్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 'మనోజ్ పర్సనల్‌గా తీసుకున్నాడు అనుకుంటా. తిరుపతిలో కాలేజ్ కట్టి పంచ్ అదిరింది' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు తన తండ్రి మోహన్ బాబుపై పంచ్ డైలాగ్ వేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీకి ఉప్పలపాటి తేజ్ దర్శకత్వం వహించనుండగా... ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు వివరాలపై అప్డేట్స్ రానున్నాయి.

Also Read : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.