Vaazha 2 Telugu Trailer Review : రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే... బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2'. టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను నేచరల్ స్టార్ నాని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

నలుగురు కుర్రాళ్ల స్కూల్, కాలేజీ లైఫ్... అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు యువకులు జీవితాన్ని ఎలా సీరియస్‌గా తీసుకున్నారు? చివరకు ఏం సాధించారు? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీని రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. లవ్, కామెడీ, విద్యార్థుల అల్లరి ఇలా యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మూవీ ఉండనుంది.

రెండేళ్ల క్రితం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'వాలా' (బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్). కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ రూ.40 కోట్లు కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్‌గా 'వాలా 2 : బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' తెరకెక్కించారు. ఏప్రిల్ 2న మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. మరి తెలుగులో ఈ నెల 24న రిలీజ్ చేస్తుండగా... ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Also Read : అల్లు అర్జున్ రెమ్యునరేషన్... 30 పైసలే! - ప్రొడ్యూసర్‌కు రిలీఫ్ ఇచ్చేలా న్యూ స్ట్రాటజీ... ఎన్ని కోట్లో తెలుసా?