Ustaad Bhagat Singh Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ: 'గబ్బర్ సింగ్' కాంబోలో మరో హిట్ పడిందా? పవన్ - హరీష్ సినిమా ఎలా ఉందంటే?
3 weeks ago 4
ARTICLE AD
Pawan Kalyan Ustaad Bhagat Singh Telugu Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆయన డై హార్డ్ ఫ్యాన్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, హరీష్ కాంబోలో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Ustaad Bhagat Singh Story):
కథ:
తన ఆశయాల కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజా సేవ చేస్తూ సీఎం పదవి వరకూ ఎదిగిన మాస్టారు ఫై దాడి జరుగుద్ది. తన శిష్యుడి గా పెరిగిన అనాధ బాలుడు ఉస్తాద్ భగత్ సింగ్. ముఖ్యమంత్రి పదవి కోసం మాస్టారు ఫై హత్యాయత్నం చేయిస్తాడు మంత్రి నాగప్ప (పార్తిపన్ ). అలాంటి స్థితి లో తనను ఆదరించిన ఒకప్పటి మాస్టారు ప్రస్తుత సీఎం ను ఉస్తాద్ ఎలా కాపాడాడు. తను అడవిలో ఎందుకు ఉంటున్నాడు. రాశి ఖన్నా ఫ్యామిలీ తో అడవిలోకి ఎందుకు వచ్చింది. శ్రీ లీల ఎవరు. నల్లమల లో తీవ్రవాదులు ఏం చేస్తున్నారు. అసలు ఉస్తాద్ మిషన్ ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ (Ustaad Bhagat Singh Review):
ముందు నుండీ ప్రచారం జరిగినట్టు తమిళ హిట్ "తెరి " రీమేక్ కాదు ఇది. జస్ట్ ఒక్క సీక్వెన్స్ మాత్రమే తీసుకున్నారు.
ఇక కథ లోకి వస్తే ఉగాది పచ్చడి లో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమా లోనూ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ లాంటి ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అయితే ఉస్తాద్ లో పవన్ పొలిటికల్ ఎజెండా లైన స్త్రీ రక్షణ, యాంటీ జిహాద్, దేశభక్తి, అవినీతి నిర్మూలన, సనాతన ధర్మ రక్షణ లాంటి ఆశయాలను హరీష్ శంకర్ కథలో చేర్చి తీసిన సినిమా ఇది. అందుకే సినిమా ఫ్లో అంతా ఒకేలా వెళ్ళదు. అంతలోనే కామెడీ, అంతలోనే సీరియస్, అంతలోనే పవన్ ఆషయాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంటాయి. దానితో సినిమా పూర్తి అయ్యాక ఏదో మిస్ అయిన ఫీలింగ్ తో బయటకి వస్తాడు ప్రేక్షకుడు. కొన్ని సీక్వెన్స్ పూర్తిగా పవన్ కోసం పెట్టినట్టు తెలిసిపోతుంది. ఆయన మాత్రం చలాకీ గా కనిపించారు. శ్రీ లీల తో సీన్స్ లో సూపర్ ఫిట్ గా కూడా ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చే లుక్ ఇది. రాశి ఖన్నా కు పెద్దగా సీన్స్ లేకున్నా చూడడానికి చాలా అందం గా ఉంది. సెకండాఫ్ లో శ్రీ లీల ది ముఖ్యమైన పాత్ర. బాగా చేసింది కూడా. ఇక తొలిప్రేమ లోని నీ మనస్సే పాట నుపవన్,శ్రీ లీల లపై రీ క్రియేట్ చేశారు. విలన్ గా పర్తిపన్, అయన కొడుకు గా టెంపర్ వంశీ క్రూరం గా కనిపించారు. మాష్టారు గా తరువాత సీఎం గా తమిళ సీనియర్ దర్శకులు KS రవి కుమార్ చాలా ముఖ్యమైన పాత్ర లో కనిపించగా మరో తమిళ హీరో రాంకీ పాత్ర ఆయన స్థాయిలో చెయ్యాల్సింది కాదు. గౌతమీ, LB శ్రీ రామ్ లవి రెండు మూడు సీన్ లు ఉన్న పాత్రలే. తీవ్రవాదిగా హిట్ సినిమా ఫేమ్ శ్రీధర్ కి కాస్త గుర్తింపు ఉన్న పాత్ర దక్కింది. బాగా చేసాడు. శ్రీ లీల ఫ్రెండ్ గా చేసిన అమ్మాయిది చాలా ఎమోషన్ తో కూడిన పాత్ర. ఇది గుండెను బరువెక్కిస్తుంది.
టెక్నీకల్ టీమ్:
దేవీ పాటలు బాగున్నాయి. థమన్ BGM మాత్రం రొటీన్ అనిపించింది. బహుశా OG కి తను ఇచ్చిన BGM వల్ల ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆనలేదేమో. కెమెరా వర్క్ బాగుంది. హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రీ స్థాయిలోనే ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్… పవన్ ఎనర్జీ, ఆయన పంచ్ డైలాగ్స్, యాక్షన్, డాన్స్ అభిమానులకు నచ్చుతాయి. అయితే… ఆసక్తిగా మొదలైన సినిమా మధ్యలో ఎటెటో తిరిగి చివరకు ఆపరేషన్ సింధూర్ డైలాగులతో ఎండ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే ఈ సినిమాను మిగిలిన వాళ్లు కూడా ఓసారి ట్రై చెయ్యొచ్చు.
బాటమ్ లైన్ : సనాతన ఉస్తాద్
Read Entire Article