Pawan Kalyan's Ustaad Bhagat Singh Collar Ey Etthara Song Out : పవర్ స్టార్ అభిమానులకు ఫుల్ మాస్ ట్రీట్ వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్‌ను మించి ఫుల్ మాస్ బీట్‌తో మూడో సాంగ్ వచ్చేసింది.

ప్రతీ ఫ్యాన్ కాలర్ ఎత్తేలా...

రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ పాటకు డబుల్ ఎనర్జీ ఇచ్చిందనే చెప్పాలి. 'ఎక్కే దిగే కిక్కులోనా దక్కేదేవుందే అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే... ఎక్కి తొక్కేటోళ్లే ఉన్నా తగ్గేదేముందే అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే... ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా...' అంటూ సాగే లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

పవర్ స్టార్‌కు ఉండే ఫ్యాన్ బేసే సెపరేట్. ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ పవన్ అభిమాని కాలర్ ఎగరేసేలా ఉన్న సాంగ్ బీట్ అదిరిపోయింది. పవర్ స్టార్ జర్నీ ఎలివేషన్ వచ్చేలా ఉన్న లిరిక్స్ వేరే లెవల్. పవనిజాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరికీ ఈ పాట ఓ బిగ్ ట్రీట్ అనే చెప్పాలి.

Also Read : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్

ఓ సగటు పవన్ అభిమాని ఆయన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలానే స్టైలిష్, వింటేజ్ లుక్‌లో ఈ మూవీలో చూపించనున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ టీజ్‌లో 'ఇది భగత్ గీత... దమ్మున్నోడు దాటొచ్చు' ఆయన చెప్పిన ఒక్క డైలాగ్ వింటేనే అర్థమవుతోంది ఎలివేషన్ ఏ లెవల్‌లో ఉంటుందో.

పవన్ అభిమానులకు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. అంతే స్థాయిలో మూవీ నుంచి వస్తోన్న సాంగ్స్ కానీ, ట్రైలర్ టీజ్ కానీ హైప్ పదింతలు చేస్తున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

సెన్సార్ రివ్యూ

ఈ మూవీ సెన్సార్ రివ్యూ పూర్తైంది. U/A సర్టిఫికెట్ ఇవ్వగా... పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి మూవీని ఎంజాయ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. రన్ టైం 2:33:49 గంటలు కాగా... పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, స్క్రీన్‌పై పవన్ వన్ మ్యాన్ షో నడిచిందనే రివ్యూస్ వస్తున్నాయి. ఆన్ స్క్రీన్ హీరో పవన్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో హరీష్ శంకర్ అని... రాకింగ్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ మరింత బలం చేకూర్చిందని మూవీ చూసిన వారు చెబుతున్న మాట.

పవన్ సరసన రాశీ ఖన్నా, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో పార్తీబన్ విలన్ రోల్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... తమన్ బీజీఎం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.