Used Car Buying Tips In Telugu: ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్న మార్కెట్ ఏదైనా ఉందంటే అది యూజ్డ్‌ కార్స్‌ మార్కెట్. చిన్న చిన్న పట్టణాల నుంచి మెట్రో నగరాల వరకు ఈ మార్కెట్ విస్తరిస్తోంది. కారు వినియోగదారులు ఏ స్థాయిలో పెరుగుతున్నారో అదే స్థాయిలో సెకండ్ హ్యాండ్‌ కారు షో రూమ్‌లు కూడా వెలుస్తున్నాయి. అక్కడే మోసం కూడా దాగి ఉంది.

తొలి ప్రయత్నంలోనే చాలా మంది కొత్త కారు కొనేందుకు ఆసక్తి చూపరు. డ్రైవింగ్‌ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత కొత్తకారు కొనేందుకు వెళ్తారు. అంతలోపు పాత కారునే కొనేందుకు ఇష్టపడతారు. అదే ఉత్తమం కూడా. మరికొందరు ఆర్థిక స్థోమత సహకరించకపోవడంతో యూజ్డ్‌ కారుతోనే సరిపెట్టుకుంటారు. ఇలా కారు కొనాలనే ఆసక్తి ఉన్నందున యూజ్డ్‌ కారు మార్కెట్‌ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది.

ప్రజల ఆసక్తిని గమనిస్తున్న కొందరు డ్యామేజీ వాహనాలను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే దెబ్బ గట్టిగానే తగులుతుంది. లక్షలు పెట్టి కొనే వాహనం అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా ఉంటేనే మంచిది. లేకుంటే డబ్బులు పోతే నష్టం లేదు. కానీ అలాంటి వాహనాలతో రోడ్డుపైకి వస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదం.

అందుకే యూజ్డ్ కార్లు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిని ఇక్కడ వివరణ చెప్పబోతున్నాం. మీరు మోసపోకుండా ఉండేందుకు ఎంతగానో సహకరిస్తాయి.

ఎప్పుడైనా ఐదేళ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న కార్లను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతకు మించి ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మీరు ఎదుర్కొనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.

గ్లాస్‌ పరిశీలించండి
యూజ్డ్ కారు ముందుగా చూడాల్సింది గ్లాస్‌పై ఉన్న ఇయర్‌. అవును ప్రతి గ్లాస్‌పై కూడా ఇయర్‌ను రాసి ఉంటుంది. కారుకి ఉన్న అన్ని గ్లాస్‌లపై ఇయర్ ఉందో లేదో చూడండి. ఉంటే ఒకే ఇయర్ ఉందా లేకుంటే ఏమైనా మారిందా అనేది పరశీలించండి.

కార్ బోనెట్‌ పరిశీలించండి
కారు బానెట్‌ ఓపెన్ చేసి సైడ్‌ బంపర్‌ వద్ద కంపెనీ వాళ్లు వేసిన సీల్‌ ఉంటుంది చూడండి. ఆ సీల్‌ కేవలం కంపెనీ వాళ్లు మాత్రమే వేయగలరు. అలా కాకుండా ఎలాంటి సీల్ లేకుండా ప్లెయిన్‌గా బానెట్‌లో బంపర్‌లు ఉన్నాయంటే అనుమానించాల్సిందే.

ఇంజిన్ కండీషన్ ఎలా చెక్ చేయాలి
చాలా మంది ఇక్కడే మోసపోతూ ఉంటారు. కారులో ప్రతి ఇంచ్‌ చాలా జాగ్రత్తగా చూస్తారు. కానీ ఇంజిన్‌ పని తీరుపై అవగాహన లేకపోవడంతో నిండా మునుగుతుంటారు. అందుకే మీరు ముందుగా కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఆయిల్‌ గేజ్‌ వద్ద పరిశీలించిండి. అక్కడి నుంచి పొగ రావడమే. లేదా ఆయిల్‌ తుంపరులు బయటకు వస్తుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది.
తర్వాత ఇంజిన్ సౌండ్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కారు స్టార్ చేసిన తర్వాత ఇంజిన్ సౌండ్‌ ఒకే లా ఉంటే ఫర్వాలేదు. కానీ మధ్య మధ్యలో హెచ్చుతగ్గులు ఉంటే మాత్రం పునరాలోచించుకోవాలి. కారు కింది భాగంలో ఒకసారి పరిశీలించండి. కొన్ని కారు ఛాసీల నుంచిఆయిల్ లీకు అవుతూ ఉంటుంది. ఆ ఏరియాలో ఎంత క్లీన్ చేసినా కొద్దిగా మార్క్స్ పడి ఉంటాయి. ఒకసారి కింది నుంచి కారు బాడీని చూడడం మంచిది.

Also Read: టోల్‌గేట్స్‌కు కొత్త బాధ్యతలు- కారు ఓనర్లకు దబిడిదిబిడే- ఇన్సూరెన్స్ లేకపోతే జైలుకే!

విండోలు పరిశీలించాలి
మీరు కారు డోర్ తీసిన తర్వాత ఆ డోర్‌కు ఉండే బెల్ట్‌ను ఓపెన్ చేస్తే అందులో కూడా కంపెనీ సీల్‌ ఉంటాయి. అలా కంపెనీ సీల్ లేకుండా ఆ పార్టును కంపెనీది కాకుండా వేరేది అమర్చారని అర్థం. ఇలా నాలుగు డోర్ల వైపు కూడా ఓపెన్ చేసి పరిశీలించాలి.

తర్వాత ఇండికేటర్స్‌ పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. స్టీరింగ్‌ కూడా ఫ్రీగా తరిగేలా ఉండాలి. టైట్‌గా ఉంటే మాత్రం మెకానిక్‌తో మాట్లాడుకోండి. క్లచ్‌ కూడా మరీ లూజ్‌గా ఉండకూడదు. మరీ టైట్‌గా ఉండకూడు. మధ్యస్థంగా ఉండాలి. కెమెరాలు ఉంటే వాటి పని తీరు కూడా పరిశీలించండి. ఏసీ ఎలా పని చేస్తుందో గమనించండి.

వీటితోపాటు మీరు కొనాల్సిన కారు కంపెనీకి వెళ్లి ఆ కారు ట్రాక్ ఐడీ ఉంటుంది. అందులో ఆ కారు పూర్తి హిస్టరీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా స్పీడో మీటర్ ట్యాంపరింగ్‌ గురించి తెలుస్తోంది. మీకు కారులో వేలల్లోనే కనిపించవచ్చు. కానీ ట్రాక్‌ ఐడీలో మాత్రం ఒరిజినల్‌గా ఆ కారు ఎంత తిరిగిందో చూపిస్తుంది.

Also Read: లక్షన్నర ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 500కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఓ రేంజ్ ఆఫర్ ఇది.