Donald Trump Announces Ceasefire Iran:: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం 2 వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై భారీ దాడి చేస్తామని, మొత్తం నాగరికతనే అంతం చేస్తామ్న కొన్ని గంటలకే ఆయన కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఈ సీజ్‌ఫైర్ ఒప్పందంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సైనిక చర్య కోసం ముందే నిర్ణయించిన గడువుకు గంట ముందు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

హర్మూజ్ రీఓపెన్ కు మరో గడువు ఇచ్చిన ట్రంప్

‘ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయాలని నేను నిర్ణయించుకున్నాను. శత్రుత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించడానికి ఇరాన్ నిర్ణయం తీసుకోవడంపై మా నెక్ట్స్ స్టెప్ ఉంటుంది.

ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తిరిగి తెరవడానికి అంగీకరిస్తేనే మేం కాల్పులు, దాడులపై వెనక్కు తగ్గుతాం. దాంతో రెండు వైపులా కాల్పుల విరమణ జరుగుతుంది. ఇప్పటికే అన్ని సైనిక లక్ష్యాలను సాధించాం. ఇరాన్‌తో శాశ్వత శాంతి, మధ్యప్రాచ్యంలో స్థిరత్వం కోసం ఒక ఒప్పందం చేసుకోవడంలో మేం బాగా ముందుకు వెళ్తున్నాం. ఇరాన్ 10 పాయింట్ల ప్లాన్ సమర్పించింది. ఇది చర్చలకు ఆచరణాత్మక పునాదిని అందిస్తుందని భావిస్తున్నానని’ ట్రంప్ అన్నారు.

US President Donald Trump posts, "Based on conversations with Prime Minister Shehbaz Sharif and Field Marshal Asim Munir, of Pakistan, and wherein they requested that I hold off the destructive force being sent tonight to Iran, and subject to the Islamic Republic of Iran agreeing… pic.twitter.com/Vmhlcm8CzR

— ANI (@ANI) April 7, 2026

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషించింది

షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌తో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సంయమనం పాటించాలని, బలగాలను ఉపయోగించడాన్ని వాయిదా వేసుకోవాలని పాక్ కోరినందుకు ఆయన వారి పాత్రను అంగీకరించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో చర్చల తర్వాత ఇరాన్‌పై షెడ్యూల్ చేసిన విధ్వంసక దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ వివరించారు.