UPI Payment Rules 2026: మన రోజు వారీ కొనుగోలుకు.. నగదుకు బదులుగా ఎక్కువగా UPI ద్వారానే చెల్లింపులు చేస్తుంటాం. అయితే, అక్టోబర్ 15, 2026 నుంచి మర్చంట్ UPI లావాదేవీలపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది వ్యాపారులు పెద్ద మొత్తంలో యూపీఐ చెల్లింపులను స్వీకరించడానికి ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాపారులు UPI చెల్లింపులను నిరాకరించవచ్చా? చట్టం ఏం చెబుతోంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

UPI పేమెంట్స్ నిరాకరించవచ్చా?

సాధారణంగా చిన్న వ్యాపారులందరూ అన్ని UPI చెల్లింపులను అంగీకరించడం చట్టరీత్యా తప్పనిసరి కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వ్యాపారులు డబ్బు రూపంలో చెల్లించమని కోరవచ్చు. అయితే, రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారాలు మాత్రం డిజిటల్ చెల్లింపు ఎంపికలను కచ్చితంగా పాటించాలి. కాబట్టి, కొత్త MDR నిబంధనలు వచ్చినంత మాత్రాన ప్రతి చిన్న వ్యాపారి UPIని అంగీకరించడానికి నిరాకరించవచ్చని దీని అర్థం కాదు.

Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తేదీలు ఖరారు.. అక్టోబర్ 8 నుంచి సేల్ స్టార్ట్

MDR అంటే ఏమిటి? ఎంత ఛార్జీ?

అక్టోబర్ 15, 2026 నుండి రూ.2,000 దాటిన ఎంపిక చేసిన P2M (కస్టమర్-టు-షాప్) UPI లావాదేవీలపై 0.4% MDR వర్తిస్తుంది. ఈ ఛార్జీ ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.300 వరకు పరిమితం ఉంటుంది. ఉదాహరణకు, రూ.3,000 లావాదేవీకి రూ.12 ఎండీఆర్, అలాగే రూ.50,000 లావాదేవీకి రూ.200 MDR వర్తిస్తుంది. అయితే రూ.2,000 వరకు జరిగే చెల్లింపులకు ఈ MDR నుండి పూర్తి మినహాయింపు ఉంటుంది. అలాగే పర్సన్ టు పర్సన్ (P2P) జరిగే UPI లావాదేవీలు ఎప్పుడూ ఉచితంగానే ఉంటాయి.

Also Read:  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌పై బిగ్ అప్డేట్.. అక్టోబర్ 9 నుంచి సేల్

కస్టమర్‌పై భారం పడుతుందా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కొత్త MDR నిబంధనలపై స్పష్టతనిచ్చారు. ఈ ఛార్జీలు వినియోగదారులకు బదిలీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని చెప్పారు. అంటే కేవలం UPI ద్వారా చెల్లింపు చేసినందుకు కస్టమర్ నుండి ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదన్నారు. MDR అనేది పన్ను లేదా సెస్ కాదు, కేవలం చెల్లింపు వ్యవస్థలో భాగం చేసేందుకు ఇది ఒక ఛార్జీ మాత్రమే అన్నారు. ఈ నిబంధనల కారణంగా సుమారు 96% P2M UPI లావాదేవీలు కొత్త MDR వల్ల ప్రభావితం కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే, చిన్న వ్యాపారులు కొన్నిసార్లు నగదు కోరినప్పటికీ, పెద్ద వ్యాపార సంస్థలు డిజిటల్ చెల్లింపులను కొనసాగించాల్సి ఉంటుంది. కస్టమర్లు మాత్రం అదనపు ఛార్జీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Also Read: యూపీఐ కొత్త రూల్స్.. రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ