UK Education Expenses Explained : విదేశాలలో చదువుకోవాలని డ్రీమ్ చాలామందికి ఉంటుంది. అలా వెళ్లాలనుకునే విద్యార్థులకు యూకే ఒక ప్రధాన ఎంపిక. కానీ ఇక్కడ చదువుకోవడానికి ఫిక్స్ అయ్యే ముందు.. అక్కడ మీ చదువుకోసం అయ్యే మొత్తం ఖర్చు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టడీ కోసం అంటే కేవలం యూనివర్సిటీ ఫీజులే కాకుండా.. లైఫ్స్టైల్, రోజువారీ ఖర్చులు కూడా బడ్జెట్‌లో ఉండాలి. సరైన సమాచారం ఉంటే.. మీరు మెరుగైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లొచ్చు.

డిగ్రీ కోసం..

యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఫీజులు కోర్సు, విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. విద్యార్థులు సాధారణంగా ట్యూషన్ ఫీజు 11,000 పౌండ్ల నుంచి 38,000 పౌండ్ల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో ఈ కోర్సు పూర్తి చేయడానికి సుమారు మూడు సంవత్సరాలు పడుతుంది. అయితే స్కాట్లాండ్‌లో దీనికి నాలుగు సంవత్సరాల వరకు పట్టవచ్చు.

మాస్టర్ డిగ్రీ కోసం..

మాస్టర్స్ డిగ్రీకి కోసం స్టూడెంట్స్ 9,000 నుంచి 30,000 పౌండ్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా మాస్టర్స్ కోర్సులు ఒకే సంవత్సరంలోనే పూర్తవుతాయి. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.

లైఫ్ స్టైల్ కోసం..

యూకేలో జీవన వ్యయం నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. లండన్‌లో నివసించే విద్యార్థులు నెలకు సుమారుగా 1,300 నుంచి 1,400 పౌండ్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర నగరాల్లో ఈ ఖర్చు 900 నుంచి 1,300 పౌండ్ల వరకు ఉంటుంది. అద్దె అనేది అతిపెద్ద ఖర్చు. ఆహారం, రోజువారీ అవసరాల కోసం కూడా ఖర్చులు ఉంటాయి.

ఫుడ్, ఇతర ఖర్చులు

విద్యార్థులు ఆహారం కోసం నెలకు సుమారు 100 పౌండ్లు ఖర్చు చేస్తారు. ఇది కాకుండా ట్రిప్, సామాజిక కార్యక్రమాల కోసం ఓ 50 పౌండ్లు ఖర్చు చేస్తారు. యూకేలో ప్రజా రవాణా సర్వసాధారణం. విద్యార్థులు నెలకు సుమారు 50 పౌండ్ల నుంచి 60 పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా చిన్న చిన్న అవసరాలు, షాపింగ్‌కు సంబంధించిన అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.

అన్నింటినీ కలిపి చూస్తే.. యూకేలో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్కు సంవత్సరానికి సుమారు 20,000 నుంచి 55,000 పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం కోర్సు, విశ్వవిద్యాలయం, నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక పౌండ్ విలువ ఇండియన్ రూపాయల్లో 128 ఉంది. దానిని బట్టి మీరు బడ్జెట్ అంచనా వేసుకోవచ్చు.