Nandu's Ugly Story OTT Streaming : టాలీవుడ్ యంగ్ హీరో నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ' ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 15 రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'అగ్లీ స్టోరీ' ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాకు ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించగా... రియా జియో ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. నందు, అవికా గౌర్‌లతో పాటు రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సైకో మొగుడిగా నందు, అమాయక భార్య పాత్రలో అవికా అద్భుతంగా నటించారు. 'ప్రతీ లవ్ స్టోరీ అందంగా ఉండదు. కొన్ని కనిపించక ముందే ఎన్నో గాయాలు మిగులుస్తాయి. వ్యామోహం, మోసం, ఎమోషనల్ వార్‌తో సాగే సస్పెన్స్ స్టోరీని వీక్షించండి.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.

Also Read : Maa Behen Telugu OTT : మాధురి దీక్షిత్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీ - కీ రోల్‌లో స్పిరిట్ బ్యూటీ... తెలుగులోనూ స్ట్రీమింగ్