Bhagwa Dhwaj : తెలుగు నూతన సంవత్సరం ఆరంభాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడని పురాణాల్లో ఉంది. ప్రారంభానికి చిహ్నంగా..ఏడాది మొత్తం విజయవంతంగా, ధర్మబద్ధంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.

కాషాయరంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే.. కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే రంగు.

ఇంటి పై జెండా ఎగురవేస్తే దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని నమ్మకం.

చారిత్రక కోణంలో చూస్తే ఉగాదిని విజయ దినంగా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన సందర్భ ఇది. అందుకే ధ్వజాన్ని విజయానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం వల్ల ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతుందని అర్థం

ఏ శుభకార్యం అయినా గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెడతారు. ఉగాది సందర్భంగా ఇంటిపై బాల్కనీలో కాషాయ జెండా ఎగురవేస్తే ఇంటికి శుభం జరుగుతుందని నమ్మకం.

సాధారణంగా ఓంకారం లేదా హనుమంతుడి చిహ్నం ధ్వజంగా ఉంచుతారు. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదం.

ఇంటి పైకప్పుపై కాషాయ ధ్వజం ఎగురవేసే అవకాశం లేకపోతే బాల్కనీలో కూడా జెండా ఎగురవేయొచ్చు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. మీకు విశ్వాసం ఉంటే ఎగురవేయొచ్చు లేదంటే ఎగురవేయొద్దు..దీనిపై చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి పూజాస్థలాన్ని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి. పరిశుభ్రమైన దుస్తులు ధరించండి, మురికి బట్టలు - చినిగిన వస్త్రాలు ధరించవద్దు. పూజ పూర్తిచేసి ఉగాది పచ్చడి స్వీకరించండి.. పంచాంగ శ్రవణం చేయండి. దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి

ఉగాది రోజు చేయకూడనివి

సూర్యోదయం తర్వాత వరకూ నిద్రపోకూడదు

మాంసాహారానికి దూరంగా ఉండాలి, మద్యం తీసుకోరాదు, సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి

మురికి దుస్తులు, నలుపు రంగు దుస్తులు ధరించకూడదు

దక్షిణ దిశవైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు..లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని నమ్మకం

ఎవరితోనూ గొడవ పడొద్దు..కోపం, చిరాకు చూపించకండి.. రోజంతా సంతోషంగా - శాంతంగా ఉండాలి

అప్పులు తీసుకోవద్దు..ఇవ్వొచ్చు..

ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యం, సంపద, సుఖ శాంతులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు 2026-2027 ! మేషం నుంచి మీనం 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం ఫలితాలు!

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

ఉగాది 2026 - పరాభవ నామ సంవత్సర కందాయ ఫలాలు! మీ నక్షత్రానికి సున్నా ఉంటే ఏం జరుగుతుంది!