Makara Rashi Parabhava Nama Samvatsaram Phalitalu 2026 2027

ఉగాది పంచాంగం 2026-2027 : మకర రాశి

ఉత్తరాషాఢ 2,3,4, పాదాలు , శ్రవణం , ధనిష్ఠ 1,2 పాదాలు
ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం6

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశివారికి గతేడాది కన్నా శని బలంగా ఉండడంతో మంచి ఫలితాలుంటాయి. కుటుంబ కారకుడు అయిన గురుడు 7వ ఇంట రాహువుతో కలిసిఉన్నప్పటికీ లగ్నాధిపతి శని బలంగా ఉండడం వల్ల శుభమే జరుగుతుంది. చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు, ఆదాయం బావుంటుంది. ఎలాంటి ఒడిదొడకులు ఉండవు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగువేస్తారు. పణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఈ ఏడాది మీరు ఎంత దైవారాధన చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. అన్నిరంగాలవారికి యోగం కాలం, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఇంట్లో మార్పులు, దొంగభయం, ప్రయాణంలో నష్టాలు, సోదరుల మూలక ఇబ్బందులు తప్పవు

పరాభవ నామ సంవత్సరం మకర రాశి ఉద్యోగులకు

2026-2027 మకర రాశి ఉద్యోగులకు బావుంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఏడాది ఆరంభంలో స్థానమార్పులు ఉంటాయి కానీ సెప్టెంబర్ నుంచి అనుకూల ఫలితాలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగం లభిస్తుంది.

పరాభవ నామ సంవత్సరం మకర రాశి విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు ఆగష్టు వరకూ గురుబలం లేదు..అప్పటివరకూ చదువుపై శ్రద్ధ పెరగదు, జ్ఞాపకశక్తి సరిగా ఉండదు, ఈ లోగో పరీక్షలు బాగా రాయలేరు, ప్రధమార్థంలోనే ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి మంచి ర్యాంకులు సాధించడం కష్టమే. సెప్టెంబర్ నుంచి పరిస్థితిలో మార్పు వస్తుంది. అప్పటి నుంచి అనుకున్న దిశగా అడుగులుపడతాయి

పరాభవ నామ సంవత్సరం మకర రాశి క్రీడాకారులకు అనుకూల ఫలితాలున్నాయి

పరాభవ నామ సంవత్సరం మకర రాశి వ్యాపారులకు

ఈ ఏడాది మకర రాశి వ్యాపారులకు శనిబలంతో లాభాలోస్తాయి. రియల్ ఎస్టేట్, సరుకులు నిల్వచేసేవారికి, కాంట్రాక్టుపనులు చేసేవారికి రెట్టింపు లాభాలుంటాయి. బంగారం, వెండివ్యాపారాలకు ఆగష్టువరకు బాగుండదు.

పరాభవ నామ సంవత్సరం మకర రాశి వ్యవసాయదారులకు

ఈ సంవత్సరం మకర రాశి వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట బాగా పండుతుంది. సెప్టెంబర్ నుంచి అనుకూలవాతావరణం, అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కౌలుదార్లకు మంచి ఫలితాలుంటాయి. చేపలు, రొయ్యలు చెరువుల వారికి సెప్టెంబర్ తర్వాత లాభాలొస్తాయి

పరాభవ నామ సంవత్సరం మకర రాశి రాజకీయ నాయకులకు

ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల తిరుగుండదు. ప్రతి విషయంలోనూ మీ మాటే పైచేయిగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సాంఘికంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం సాధిస్తారు. కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధపెట్టాలి అనుకున్నా ఫెయిలవుతారు

పరాభవ నామ సంవత్సరం మకర రాశి కళాకారులకు

ఈ ఏడాది టీవీ, సినిమా రంగానికి చెందిన మకర రాశ కళాకారులకు యోగదాయకం అయిన కాలం. గతంలో వెంటాడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి అవకాశాలు, విజయాలు, అవార్డులు, ఆదాయం మీ సొంతం

మకర రాశి స్త్రీలకు

ఈ రాశి స్త్రీలకు శనిబలం వల్ల ఎదురుండదు. కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆగష్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలున్నా ఆ తర్వాత నుంచి పరిస్థితిలో మార్పుంటుంది. విలువైన వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తలమధ్య ఏమైనా వివాదాలుంటే సమసిపోతాయి. అన్ని రంగాల్లో ఉండేవారికి సెప్టెంబర్ నుంచి పరిస్థితిలో మార్పు వస్తుంది.

మొత్తంమీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గతేడాది కన్నా మంచి ఫలితాలున్నాయి.. ఆగష్టు వరకూ పరిస్థితులు అటు ఇటుగా ఉన్నా సెప్టెంబర్ నుంచి బావుంటుంది. ఉన్నతంగా జీవిస్తారు..మిమ్మల్ని చూసి అంతా ఈర్ష్య పడేలా ఉంటారు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!