Ugadi 2026: మార్చి 19న ఉగాది పూజా విధానం, పచ్చడి తినేందుకు శుభ ముహూర్తం తెలుసుకోండి!

4 weeks ago 2
ARTICLE AD

Parabhava Nama Samvatsara Ugadi 2026: మార్చి 19న ఉగాది పండుగ. విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పి శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు పూజా సమయం, పచ్చడి తీసుకోవాల్సిన సమయం తెలుసుకోండి

ఉగాదికి ముందు రోజు అంటే ఫాల్గుణ మాసం అమావాస్యను కొత్త అమావాస్యగా జరుపుకుంటారు..

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది..అదే ఉగాది

ఈ ఏడాది(2026)లో కొత్త అమావాస్య, ఉగాది రెండూ ఒకే రోజు వచ్చాయి. ఎందుకంటే.. సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాది జరుపుకోవాలి..అయితే.. ఈ సంవత్సరం మార్చి 19 గురువారం సూర్యోదయం సమయానికి అమావాస్య తిధి ఉంది.. ఆ తర్వాత పాడ్యమి ఘడియలు ప్రారంభమయ్యాయి..మార్చి 20 సూర్యోదయం సమయం కన్నా ముందే పాడ్యమి ఘడియలు ముగుస్తున్నాయి. అందుకే ఈ సంవత్సరం ఉగాది మార్చి 19 గురువారమే జరుపుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. అంటే కొత్త అమావాస్య, ఉగాది ఒకే రోజు వచ్చాయ్.

ఉగాది రోజు ఉదయం తైల అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి. అనంతరం దేవుడి మందిరం శుభ్రం చేసుకుని ఉగాది పచ్చడి చేసి ఇష్టదైవాన్ని పూజించాలి. పూజ పూర్తైన తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించాలి

ఉగాది పచ్చడి స్వీకరణకు శుభముహూర్తం

అమావాస్య ఉదయం 7 గంటల 17 నిముషాల వరకూ ఉంది.. ఆ తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి ఘడియలు ప్రారంభమయ్యాయి.
దుర్ముహూర్తం ఉదయం  10 గంటల 11 నిముషాల నుంచి 10 గంటల 59 వరకూ... తిరిగి మధ్యాహ్నం 2.58 నుంచి 3.46 వరకు
వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 12 నిముషాల నుంచి 4 గంటల 45 నిముషాల వరకు
అమృత ఘడియలు రాత్రి 12.30 నుంచి 2 గంటల 04 నిముషాల వరకు

ఉగాది రోజు పూజ, పచ్చడి స్వీకరించే సమయం వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకోవాలి. అందుకే దుర్ముహూర్తం ప్రారంభమయ్యే సమయం కన్నా ముందు..ఉదయం 7.17 తర్వాత 10 గంటల లోపు పూజ పూర్తిచేసి ప్రసాదం తీసుకోవాలి. లేదంటే 11 గంటల నుంచి 2 లోగా పూజ పూర్తిచేయాలి. ఉగాది పచ్చడి స్వీకరించేందుకు శుభసమయం  చాలా ముఖ్యం అని చెబుతారు పండితులు

నూతన వ్యాపారం, పుస్తక పఠనం, నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలుకు, ప్రారంభోత్సవాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిముషాల వరకు శుభప్రదంగా ఉంది

ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు పఠించాల్సిన శ్లోకం

త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం

అంటే..వసంతంలో చిగురించే అశోకవృక్షమా నా జీవితంలో శోకాలను తొలగించి సుఖసంతోషాలు ప్రసాదించు అని

ఉగాది పచ్చడి షడ్రుచులు తిని నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానించండి..

ఏబీపీ దేశం ప్రేక్షకులకు అందరకీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు
ఈ ఏడాది మీకు అన్నింటా శుభం కలగాలి

శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు! మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో విషెస్ చెప్పండి!

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు 2026-2027 ! మేషం నుంచి మీనం 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం ఫలితాలు!

ఉగాది 2026 - పరాభవ నామ సంవత్సర కందాయ ఫలాలు! మీ నక్షత్రానికి సున్నా ఉంటే ఏం జరుగుతుంది!

Read Entire Article