Udhayanidhi Stalin Reaction: డీఎంకే నాయకుడు, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు చిక్కులు పెరుగుతున్నాయి. నటి త్రిష గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు కారణమయ్యాయి. త్రిషను ఉద్దేశించి చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యపై ఆగ్రహించిన టీవీకే శ్రేణులు కేసులు పెట్టారు. దీంతో ఆయన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత ఉదయనిధి తొలిసారి స్పందించారు. తాను ఎక్కడా త్రిష పేరు ఎప్పుడూ ప్రస్తావించలేదని వాదిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు?

అరెస్టు చేసిన తర్వాత పోలీసు వాహనంతో తీసుకెళ్తున్న టైంలో అక్కడే ఉన్న మీడియాతో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. "నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? నేను ముఖ్యమంత్రి పేరు తప్ప మరెవరి పేరునూ ప్రస్తావించలేదు. దీనిపై నేను ఇంతంటే ఏం మాట్లాడదలుచుకోలేదు." అని అన్నారు. మంగళవారం పోలీసులు స్టాలిన్‌ను ఆయన ఇంటిలోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు ఆయన్ను పోలీస్ వ్యాన్‌లో తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

#WATCH | DMK leader and LoP Udhayanidhi Stalin detained by Police from his Chennai residence, following an FIR against him over his alleged defamatory remarks against actor Trisha and CM Vijay. Slogans directed at actor Trisha were raised at his rally yesterday. pic.twitter.com/JUk7cpaTdG

— ANI (@ANI) August 4, 2026

అసలు వివాదం ఏంటి?

కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టైంలోనే డీఎంకే శ్రేణులు గట్టిగా త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందిస్తూ, ఉదయనిధి అసభ్యకరమైన, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. త్రిష అనే నినాదాల మధ్య "ఆ నీరు వేరే చోటికి చేరినా చేరకపోయినా, కనీసం అక్కడికైనా చేరాలి" అని అన్నారు. అయితే, ఆ తర్వాత ఆయన నవ్వి, తాను కావేరీ నది నీటి గురించి అలా అన్నానని చెప్పారు.

At what was projected as a farmers protest, Udhayanidhi Stalin made an unnecessary, vulgar and double meaning comment about actress Trisha in front of thousands of men. pic.twitter.com/EvqkGrHKie

— Actor Vijay Team (@ActorVijayTeam) August 3, 2026

స్టాలిన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీవీకే జాతీయ మహిళా కమిషన్ (NCW)లో స్టాలిన్‌పై ఫిర్యాదు చేసింది. ఉదయనిధికి నోటీసు జారీ చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ NCWని డిమాండ్ చేసింది.

జైలుకు పంపాలని బీజేపీ డిమాండ్

తమిళనాడు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి కూడా ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద ప్రకటనను వ్యతిరేకించి, అతడిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, "తంజావూరులో ఉదయనిధి చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటైనవి, అసభ్యకరమైనవి, హేయమైనవి. ఏ సంస్కారవంతుడూ బహిరంగ వేదికపై ఇలాంటి అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు" అని అన్నారు.