UBS - వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కాదు హరీష్

4 weeks ago 2
ARTICLE AD

నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ కి వన్ మ్యాన్ ఆర్మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, దర్శకుడు హరీష్ శంకర్ అనే అందరూ ముక్త ఖంఠంతో మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి షూటింగ్ చేసి వెళ్లిపోయారు. జస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో కనిపించి అభిమానులను ఉద్దేశించి మట్లాడారు. ఇక్క అక్కడితో పవన్ పని అయిపొయింది.

కానీ ఉస్తాద్ కి పవన్ డేట్స్ ని బట్టి ఆగమేఘాల మీద షూటింగ్ కంప్లీట్ చేసి రేపు సినిమా విడుదలకు రెడీ అయినప్పటికీ.. ప్రీ పోన్ కారణంగా ఇంకా ఓవర్సీస్ కాపీలు పంపించడం, అలాగే సినిమాపై ఆడియన్స్ లో క్రేజ్ పెంచేలా ఇంటర్వూస్ ఇవ్వడం, సమయం లేకపోయినా సినిమాని ప్రమోట్ చెయ్యడం, పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మట్లాడడం.. మీడియా, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా హరీష్ మాత్రమే కనిపిస్తున్నారు.

అటు హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా.. కన్నా ఎక్కువగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో తెగ హడావిడి చెయ్యడం చూసిన వారు ఉస్తాద్ భగత్ సింగ్ కి వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కాదు హరీష్ శంకర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Read Entire Article