తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా హంగ్ వచ్చింది. ఏ పార్టీకి, కూటమికిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సాధారణ మెజార్టీ కూడా రాలేదు. అయితే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. అన్నాడీఎంకే కూటమి 53 సీట్లు, డీఎంకే కూటమి 73 సీట్లు నెగ్గాయి. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు టీవీకే అధినేత విజయ్ రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందకు రిసార్ట్ వేటలో పడినట్లు తెలుస్తోంది.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే దేశలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరిగాయి. మే 4న ఎన్నికల కమిషన్ కేరళం, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించింది. తమిళనాడులో అంతా డీఎంకేదే అధికారమని ఫిక్సయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అలాగే వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వందకు పైగా స్థానాల్లో విజయం సాధించింది.

రిసార్ట్ వేటలో టీవీకే?
తమిళనాడులో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు పార్టీ ఎమ్మెల్యేల్ని సురక్షితంగా ఉంచడానికి కూవత్తూరు తరహాలో ఒక రిసార్ట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలిచిన వారు తన పనయూర్ నివాసానికి రావాలని ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే పార్టీ అభ్యర్థులను విజయ్ ఆదేశించారు. ఏ పార్టీకి, కూటమికి మెజార్టీ రాకపోవడంతో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు అని విజయ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీలు ప్రలోభపెట్టడం, భయపెట్టడం, కిడ్నాప్ లాంటి డ్రామాలు లేకుండా చూడటంలో భాగంగా అందర్నీ రిసార్ట్‌కు తరలించాలని చూస్తున్నారని సమాచారం.

#WATCH | Chennai, Tamil Nadu: Heavy security has been deployed outside the residence of TVK Chief & winning candidate from Perambur Assembly constituency, Vijay.

TVK won 108 out of 234 seats in the Tamil Nadu Assembly Elections, becoming the single-largest party. pic.twitter.com/q3SC0oXOqY

— ANI (@ANI) May 5, 2026