TVK Vijay Oath Taking Ceremony: శని పోయింది, విజయం వరించింది, ప్రమాణ స్వీకారం నుంచి రాజయోగమేనా?

1 month ago 5
ARTICLE AD

TVK Vijay Oath Taking Ceremony:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార DMK, ప్రతిపక్ష ADMKను వెనక్కు నెట్టి దూసుకొచ్చారు తమిళగ వెట్రి కజగం (TVK) అధిపతి దళపతి విజయ్.   మే 07 గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  మే 7 ఉదయం 11 గంటల 30 నిముషాలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

విజయ్  క్రిస్టియన్ కావడంతో తిథి,వార,నక్షత్రాలు..ముహూర్తాల పట్టింపులు ఉండకపోవచ్చు కానీ.. ఆయనకు ఓటేసిన ప్రజలు,  అభిమానులు అన్ని మతాలకు చెందినవారూ ఉన్నారు. అందుకే తమ అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకార మహోత్సవం చేసే సమయం శుభప్రదమైనది అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతకీ మే 7న ఎలా ఉంది?

2026 మే 07 గురువారం

తిథి-  పంచమి ఉదయం 6 గంటల 45 నిముషాలకు ముగిసి.. షష్ఠి మొదలవుతోంది. అంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఉన్న తిథి షష్ఠి

నక్షత్రం - మే 07న పూర్వాషాడ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 38 నిముషాల వరకూ ఉంది

దుర్ముహూర్తం - ఉదయం 9 గంటల 50 నిముషాల నుంచి 10 గంటల 41 నిముషాల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల 55 నిముషాల నుంచి  3గంటల 46 నిముషాల వరకు... అంటే.. విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి దుర్ముహూర్తం లేదు

అమృత ఘడియలు - ఉదయం 10 గంటల 22 నిముషాల నుంచి 12 గంటల 07 నిముషాల వరకు. ఈ లెక్కన.. ప్రమాణ స్వీకార ముహూర్తం 11.30 కి కాబట్టి.. అమృత ఘడియల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు విజయ్.

షష్ఠి తిథి మంచిదేనా?

షష్టి తిథి తమిళులకు అత్యంత శుభప్రదమైన తిథి. షష్ఠిని నందా తిథి అంటారు..అంటే ఆనందాన్ని, శుభాన్ని ఇచ్చేదని అర్థం. కార్తికేయస్వామి తిథి కావడంతో ఈ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా సాగుతాయని, సవాళ్లు ఎదురైనా చివరకు విజయం వరిస్తుందని తమిళుల విశ్వాసం. మరీ ముఖ్యంగా తెలుగు నెలలు అన్నింటిలో వైశాఖం అత్యంత విశిష్టమైనది. తిథి దోషం లేని నెల ఏదైనా ఉందంటే అది వైశాఖమే..ఈ నెలలో అన్ని తిథులూ మంచివే, ఈ నెలలో ఏ పని చేపట్టినా విజయమే...అందుకే వైశాఖాన్ని మాధవ మాసం అని పిలుస్తారు.

విజయ్ నక్షత్రం ప్రకారం ఎలా ఉంది?

సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విజయ్ 1974 జూన్ 22న జన్మించారు. ఆ రోజు పంచాంగ వివరాల ప్రకారం విజయ్ ది పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఈ రాశివారికి రెండున్నరేళ్ల తర్వాత అష్టమ శని నుంచి ఉపశమనం లభించింది. ఈ ఏడాది మొత్తం శని శుభస్థానంలోనే ఉంది. అంటే.. శని వదిలిపోవడంతో విజయ్ కష్టం ఫలించి ఫ్రతిఫలం దక్కిందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

ప్రమాణ స్వీకారం రోజు ఉన్న నక్షత్రం పూర్వాషాడ... విజయ్ నక్షత్రం నుంచి ప్రమాణ స్వీకారం రోజున్న నక్షత్రానికి తారాఫలం లెక్కిస్తే నాలుగో నంబర్ వచ్చింది..అంటే క్షేమతార.

వైశాఖమాసంలో ప్రతి రోజూ మంచిదే

షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి తిథి కావడం తమిళులకు సెంటిమెంట్

నక్షత్రం ప్రకారం తారాఫలం అదిరింది

అన్నిటికీ మించి.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం అమృత ఘడియల్లో చేస్తున్నారు..అంటే రోజు మొత్తం తిథి, వార, నక్షత్రాలు ఎలా ఉన్నా ఆ ఘడియలు అత్యద్భుతం.

ఇవన్నీ విజయ్ పట్టించుకున్నా లేకున్నా ప్రమాణ స్వీకారోత్సవానికి పెట్టుకున్న ముహూర్తం మంచిదే కావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది...

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article