Actress Trisha Hints At Not Being Invited To Karuppu Audio Launch Event : కోలీవుడ్ స్టార్ సూర్య, సౌత్ క్వీన్ త్రిష జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కరుప్పు' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను వీరభద్రుడిగా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌కు త్రిష హాజరు కాకపోవడంపై నెట్టింట ట్రోలింగ్ సాగింది. కొందరు ఆమెపై నేరుగానే విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అయ్యారు.

ఆహ్వానం అందలేదా?

తాను ఉద్దేశపూర్వకంగానే ఈవెంట్‌కు అటెండ్ కాలేదనే విమర్శలను త్రిష ఖండించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయిన ఆమె... 'నా ఇన్విటేషన్ మెయిల్‌లో పోయిందేమో?' అంటూ ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఆమెకు అసలు కరుప్పు టీం నుంచి ఆహ్వానం అందలేదనే ప్రచారం సాగుతోంది. ఇన్విటేషన్ లేదని ఇండైరెక్ట్‌గా త్రిష అలా చెప్పారనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ మూవీలో త్రిష ప్రీతి అనే రోల్‌లో నటిస్తున్నారు. ఆమె పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మోడ్రన్, స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. కోర్ట్ రూంలో సీరియస్ లాయర్‌గా కనిపించారు. త్రిష రోల్, లుక్‌పై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపించారు. అయితే, ఆడియో లాంచ్ కార్యక్రమానికి త్రిష హాజరు కాకపోవడంపై ట్రోలింగ్ సాగింది.

Also Read : మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

'త్రిష ఉందని మర్చిపోయా'

ఓ నెటిజన్ త్రిష లుక్‌కు ఫిదా అవుతూ... 'ఓరి దేవుడా అవును. కరుప్పు సినిమాలో త్రిష ఉందనే విషయమే మర్చిపోయా (ఏడుస్తున్న ఎమోజీ). ఆమె ఎంత యంగ్‌గా కనిపిస్తున్నారో మనం మాట్లాడుకోవచ్చా. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తుంది.' అంటూ ట్వీట్ చేయగా... దీనిపై త్రిష రిప్లై ఇచ్చారు. 'ధన్యవాదాలు. నేను కూడా మర్చిపోయా. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది.' అంటూ సెటైరికల్‌గా సమాధానం ఇచ్చారు.

దీనిపై సూర్య ఫ్యాన్ రియాక్ట్ అవుతూ... 'మీరు ఆడియో లాంచ్‌కు రాలేదు. ఇంత సెటైరికల్ ఆన్సర్ అవసరమా?' అంటూ ప్రశ్నించాడు. దీనికి త్రిష సమాధానం ఇస్తూ... 'నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయి ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు ఆహ్వానం అందలేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పిలవకుండా కనీసం ఎవరైనా ఎలా వెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్‌ను ఇలా అవమానిస్తారా?... సూర్య, మూవీ టీం దీనిపై రియాక్ట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9

— Trish (@trishtrashers) May 1, 2026

Guess my invite got lost in the mail :)

— Trish (@trishtrashers) May 1, 2026

Also Read : 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

Also Read : 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా... సూర్య, త్రిషలతో పాటు యోగిబాబు, స్వాసిక, నట్టి సుబ్రమణియం, ఇంద్రన్స్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియార్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.