Director Vassishta Mallidi Clartifies About Vishwambhara Rumours : సౌత్ క్వీన్ త్రిష చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు మూవీలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేం వశిష్ట మల్లిడి కాంబోలో రాబోతోన్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర'లో ఆమె అవని పాత్రలో చేస్తున్నారు. రీసెంట్‌గానే సౌత్ క్వీన్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. తాజాగా మూవీపై వస్తోన్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

అవునా... నిజమా?

ఈ మూవీ నుంచి లుక్స్, సాంగ్స్ తప్ప ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ పాటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... VFX వర్క్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో పలు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా వాటికి చెక్ పెట్టారు డైరెక్టర్ వశిష్ట. 'టఈ మూవీ రెండు పార్టులుగా రానుంది.' అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి స్వయంగా ఆయనే రిప్లై ఇచ్చారు. 'అవునా... నిజమా?' అంటూ ఫన్ ఎమోజీస్ యాడ్ చేశారు. దీంతో విశ్వంభర ఒకే పార్ట్‌గా రానుందంటూ కన్ఫర్మ్ అయిపోయింది.

Avunaa.. Nijamaa.. 😅😅

— Vassishta (@DirVassishta) May 10, 2026

Also Read : కోటలో బ్రహ్మ రాక్షసుడు... బలిగా మనిషి ప్రాణం - ఓటీటీలో టాప్ ట్రెండింగ్ హారర్ మూవీ