Trinayani Serial Today Episode సుమన తనకు నయని ఆత్మ సోకిందని ఇంట్లో డ్రామా మొదలు పెట్టి అందర్ని షాక్‌కి గురి చేస్తుంది. అయితే నయని గాయత్రీ పాపని సుమన దగ్గరకు పంపి ఆ ఆత్మ సంగతేంటో చూడమని అంటుంది. పాప సుమన దగ్గరకు వెళ్తుంది. దగ్గరకు రావొద్దు అని సుమన అరుస్తుంది. పాప సుమనను చూస్తూ చెంపలు వాయించేస్తుంది. సుమన కదలకుండా అలా ఉండిపోతుంది. అందరూ చూసి షాక్ అయిపోతాడు. విక్రాంత్ అయితే నవ్వుకుంటాడు. సుమన కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ నీళ్లు చల్లి సుమనను లేపుతారు.

వల్లభ: మమ్మీ మనం ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందేంటి.
తిలోత్తమ: సైలెన్స్ సుమనకు చిర్రెత్తుకొస్తే మన పేర్లు చెప్పేస్తుంది.
సుమన: చెంపలు వాయించేసింది ఈ పిల్ల.
దురంధర: గాయత్రీ అలా కొట్టడం వల్లే నీకు పట్టిన దెయ్యం వదిలింది.
సుమన: మనసులో నాకు దెయ్యం పట్టడం ఏంటి అత్తయ్య వాళ్ల మాటలు విని ఈ పిల్ల చేతిలో దెబ్బలు తిన్నాను. ఛీఛీ..
విక్రాంత్: మనసులో ఎలా ఆలోచిస్తామో దానికి తగ్గట్టు ప్రవర్తిస్తామంట. ఒక సారి నీ మనసుని క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది.
నయని: చెల్లి నీ ఆలోచనలో అర్థముంది కానీ దానికి తగ్గట్టు ఆధారం ఉండాలి. అది లేనప్పుడు నిజానికి కూడా నీడ ఉండదు. అలాంటప్పుడు దాన్ని కూడా నమ్మరు.
సుమన: అర్థం కాలేదు అక్క.
నయని: టైం పడుతుంది.
విక్రాంత్: సుమనను గదిలోకి తీసుకెళ్లి.. నువ్వు దెయ్యంలా ఊగిపోతుంటే గాయత్రీ పెద్దమ్మ వాయించకుండా ఉంటుందా.
సుమన: మీరు అలా తనని వెనకేసుకొస్తున్నారు కానీ నాకు అయితే ఆ పిల్లని వాయించేయాలి అని అనిపిస్తుంది.
విక్రాంత్: ఈ జన్మకి నువ్వు గాయత్రీ పెద్దమ్మ తలలోని వెంట్రుక కూడా పీకలేవు.
సుమన: అంత బలవంతురాలా.
విక్రాంత్: చిన్న పిల్ల కొడితేనే ఇంత బాధ పడుతున్నావ్ పిల్ల తల్లి కొట్టుంటే నీ శవానికి దండ వేసేవాళ్లం. పిచ్చి సుమన నువ్వు మా అమ్మా వాళ్ల మాటలు విని ఇలా చేస్తున్నావ్ అని అర్థమైంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకో నయని వదిన మీద నీకు డౌట్ ఉంది కాబట్టి నీ ఒంటి మీద మచ్చలు పెరుగుతున్నాయి.
సుమన: నిన్నటి వరకు మా అక్కని నేను అనుమానించకూడదు అనుకున్నా కానీ వల్లభ బావగారు ఆ బామ్మ గురించి చెప్పాక ఆ త్రినేత్రి ఇంట్లో తిష్ట వేసిందని అర్థమైంది.
విక్రాంత్: మళ్లీ మొదటికి వచ్చావ్ సుమన సర్లే నీ ఒళ్లు హూనం అవ్వాలని రాసి ఉంది ఎవరేం చేయలేరు. నయని వదిన ఈ ఇంట్లో లేదని నువ్వు నిరూపిస్తే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతా.
సుమన: వెళ్లిపోవడం కాదు కానీ మీరు నా జీవితం లోకి రావాలి నా మాట వినాలి. ఏమంటారు.
విక్రాంత్: అలాగే కానివ్వు గుడ్ లక్ అండ్ గుడ్ నైట్.

నయని, విశాల్ దగ్గరకు హాసిని వెళ్లి తిలోత్తమ ఇలా నాటకం ఆడించుంటుందని అంటుంది. నువ్వు నయని అయితే ఎవరు ఎన్ని చేసినా నిరూపించలేరని విశాల్ అంటాడు. నయని విశాల్ వాళ్లతో త్రినేత్రి బామ్మ కనిపించడం వల్ల వాళ్ల అనుమానం రెట్టింపు అయిందని అంటుంది. పూర్తిగా కోలుకోక ముందు నేను ఎందుకు త్రినేత్రిలా మాట్లాడానా అని ఆరా తీసి కొన్ని విషయాలు తెలుసుకున్నానని నయని అంటుంది. మీకు త్రినేత్రి కి సంబంధం ఉందని నయని విశాల్‌తో చెప్తుంది. విశాల్ తో పాటు హాసిని కూడా షాక్ అయిపోతుంది. రాముడి లాంటి విశాల్‌ని సీత లాంటి నువ్వు అనుమానించడం తప్పని హాసిని అంటుంది. విశాల్ ఏం జరిగిందని అడుగుతాడు. దానికి నయని జరిగింది ఎలాగూ తెలుస్తుంది కానీ జరగబోయేది చెప్తానని మీ ఆయన వల్ల పరువు నష్టం ఉంటుందని అంటుంది. త్రినేత్రి వాళ్ల బామ్మ, మేనత్త, మేనమామల్ని తీసుకొస్తారని వాళ్లకి త్రినేత్రి, మీకు నయని కావాలని చెప్పి నయని వెళ్లిపోతుంది. విశాల్, హాసినిలు ఆలోచనలో పడతారు.

ఉదయం గాయత్రీ పాప హాల్‌లో తిరుగుతుంటే వల్లభ వచ్చి మా పెద్దమ్మ నడుముకి తాళాలు తగిలించుకొని తిరిగితే నువ్వు ఇప్పటి నుంచే తాళాలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నావా అని అంటాడు. అయినా పాప ఏం అనకుండా దురంధర, పావనా వాళ్ల గది తాళం తీసి అందులోకి వెళ్తుంది. వల్లభ ఎంత డోర్ తీసినా పాప లాక్ చేసి ఉంటుంది. తిలోత్తమ, సుమనలు వచ్చి పాపలోపలికి వెళ్లిందా పావనా వాళ్లు లేనప్పుడే కదా మనం కూడా ఆ గదిలోకి వెళ్లి చూడాలి అని అంటారు. డోర్ కొడతారు అందరూ రావడంతో పాప లోపలికి వెళ్లి లాక్ చేసుకుందని చెప్తారు. విక్రాంత్ కంగారు పడొద్దని పాపే నిదానంగా అన్ లాక్ చేస్తుందని చెప్తాడు. నయని కూడా పాపే తీస్తుంది వదిలేయండి అని అంటుంది. అలా ఎలా వదిలేస్తామని విశాల్ అంటాడు. ఆ గదిలో ఏముందని లాక్ వేశారని వల్లభ అడుగుతాడు. ఎవరు ఆ గది లాక్ తెరుస్తారా అనుకుంటే పెద్ద బొట్టమ్మ నేను తెరుస్తాను అని ఎంట్రీ ఇస్తుంది.

చాలా రోజులకు వచ్చావని వల్లభ అంటే పిల్లని చూడటానికి వచ్చానని పెద్ద బొట్టమ్మ అంటుంది. నయని పెద్దబొట్టమ్మతో లోపలికి వెళ్లాక జాగ్రత్త కంగారు పడకుండా గాయత్రీ పాపని మాత్రమే తీసుకురా అని చెప్తుంది. అన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటి అని సుమన అడుగుతుంది. పెద్దబొట్టమ్మ ఎందుకు కంగారు పడుతుందని తిలోత్తమ అడుగుతుంది. ఇక పెద్ద బొట్టమ్మ పాములా మారి గదిలోకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read:  సత్యభామ సీరియల్: సత్యని దెబ్బకొట్టడానికి క్రిష్ దగ్గర మాట తీసుకున్న మహదేవయ్య.. మామ కాని మామకు MLA టికెట్!