Yash's Toxic Romantic Track Tabaahi Song Release Date Time Locked : రాకింగ్ స్టార్ యశ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్‌లో మోస్ట్ వయలెంట్ అండ్ రొమాంటిక్ యాంగిల్స్ చూపించారు. దీంతో ఫస్ట్ సాంగ్‌పై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది.

ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే?

ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ 'తుబాహీ'ని రిలీజ్ చేయనున్నారు. యశ్, కియారా అడ్వాణీ రొమాంటిక్ ట్రాక్‌గా ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12:59 గంటలకు సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా సాంగ్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ పాటను స్వరపరిచి పాడారు.

మరోవైపు, ఈ పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యిందంటూ కొందరు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే, అది ఒరిజినల్ సాంగ్ కాదని ఏఐ జనరేటెడ్ వీడియో అని తెలుస్తోంది.

Also Read : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...