Tortoises Vastu Tips: తాబేలు ఇంటికి అదృష్టమా , దురదృష్టమా? ఎలాంటి తాబేలు ఉంటే సంపద పెరుగుతుంది, వాస్తు నియమాలేంటి?

3 weeks ago 4
ARTICLE AD

Tortoises Vastu Tips In Telugu: తాబేలు అదృష్టమా దురదృష్టమా అనే ప్రశ్నే వద్దంటారు ఆధ్యాత్మికవేత్తలు..ఎందుకంటే తాబేలు 100 శాతం అదృష్టానికి సూచనే. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారం ఒకటి. అందుకే హిందూ సంస్కృతి, పురాణాలు, వాస్తుశాస్త్రంలో తాబేలుని శుభప్రదంగా భావిస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరమథనం చేస్తున్నప్పుడు ఒరిగిపోతున్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ దేవతలకు అభయం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఉబ్భవించినదే అమృతం. అందుకే తాబేలుని స్థిరత్వం, దీర్ఘాయువు, జ్ఞానం, సంపదకు చిహ్నంగా భావిస్తారు.

వాస్తు ప్రకారం తాబేలుని ఎక్కడుంచాలి?

ఇంట్లో తాబేలు ప్రతిమ క్రిస్టల్, లోహం లేదా బొమ్మ ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆరోగ్యం, అదృష్టం వస్తాయని నమ్మకం. అయితే వాస్తు ప్రకారం తాబేలుని ఈశాన్యం లేదా ఉత్తరం, నైరుతి దిశల్లో ఉంచడం ఉత్తమం.

ఉత్తర దిశ - ఇది కుబేరుడి దిశ కాబట్టి ఇక్కడ తాబేలు బొమ్మ ఉంచితే సంపద, వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతి ఉంటుందని విశ్వాసం

ఈశాన్యం - ఈ దిశగా తాబేలుని ఉంచితే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది, కెరీర్ వృద్ధి చెందుతుంది

నైరుతి - తాబేలుని ఈ దిశగా ఉంచితే స్థిరత్వం వస్తుంది, కుటుంబంలో బందాలు బలపడతాయి

బంగారం గురించి భవిష్య మాలికలో ఏముంది? ప్రధాని మోదీ విజ్ఞప్తి మరింత ఆందోళన పెంచిందా?

తాబేలు మెటీరియల్ ప్రకారం దిశలు

మెటల్ తాబేలు అయితే ఉత్తరం లేదా వాయువ్యం వైపు ఉంచండి. కెరీర్ వృద్ధి, సంపద పెరుగుదల ఉంటుంది

క్రిస్టల్/గాజు తాబేలు అయితే ఉత్తరం లేదా నైరుతి దిశగా ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి, కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది

చెక్కతో చేసిన తాబేలు అయితే తూర్పు లేదా ఆగ్నేయ దిశగా ఉంచండి.. ఆరోగ్యం బావుంటుంది, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి

స్టోన్ లేదా రాతి తాబేలు అయితే నైరుతి దిశగా ఉంచితే స్థిరత్వం ఉంటుంది

సెరామిక్ తాబేలు అయితే ఆగ్నేయ దిశగా ఉంచితే సంపద పెరుగుతుంది

మట్టి తాబేలు అయితే ఈశాన్య దిశగా ఉంచండి..ఇంటికి మంచి జరుగుతుంది

తాబేలు ముఖం ఎప్పుడూ తూర్పు దిశగా ఉండేలా చూసుకోండి..కొందరు ఉత్తర దిశగా కూడా ఉంచుతారు. తాబేలు బొమ్మ అయినా కానీ నీటిలోనే ఉంచండి. నేరుగా నేలపై పెట్టొద్దు.. గాజు బౌల్ లేదా ప్లేట్ లో నీరు, రంగురంగుల రాళ్లు పెట్టి ఉంచండి. ఇది పాజిటివ్ ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. ప్రవేశ ద్వారం దగ్గర ఉంచి ప్రతికూల శక్తి లోనికి అడుగుపెట్టలేదని చెబుతారు వాస్తు నిపుణులు. తాబేలు ప్రతిమ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేందుకు బుధ, గురు, శుక్రువారాలు మంచిది.

నిజమైన తాబేలుని పెంచాలి అనుకుంటే ఉత్తరం లేదా, ఈశాన్య మూలలో ఉంచి సరైన సంరక్షణ అందించాలి. సరైన సంరక్షణ చేయలేకపోయినప్పుడు బొమ్మలు ఇంట్లో పెట్టుకోవడమే మంచిది. తాబేలు ఉంగరం ధరించడం వల్ల కూడా కలిసొస్తుంది చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

రోబో సన్యాసి ప్రబోధాలు, ఇకపై మత బోధనలు చేసేది కూడా AI రోబోలేనా!

Read Entire Article