Top Electric Scooters Above 120 Range: భారత్‌లో టూవీలర్ మార్కెట్ వేగంగా మారుతోంది. గతంలో కేవలం పెట్రోల్‌ వాహనాలకే పరిమితమైన జనం, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వం నుంచి ఈవీలకు లభిస్తున్న ప్రోత్సాహకాలు. ప్రస్తుతం మార్కెట్‌లో 63 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూవీలర్ మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా పెట్రోల్‌ టూవీలర్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పర్యావరణానికి ఎటువంటి హాని చేయకపోవడం మరో ప్రధాన అంశం. ఆధునిక ఈ స్కూటర్లు ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

Also Read:ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి

టీవీఎస్‌

టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ తన ఐక్యూబ్‌ సిరీస్‌తో టాప్‌లో దూసుకెళ్తోంది. టీవీస్ ఐక్యూబ్‌ ప్రారంభ ధర సుమారు 1,20, 653 రూపాయల. ఇందులో 3.1kWh, 3.5kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. ఇవి 12 నుంచి 145 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి.

తర్వాత ఈ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న మోడల్ టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌ అండ్‌ ఎస్టీ. హై ఎండ్‌ మోడల్ అయిన ఐక్యూబ్‌ ఎస్టీ 5.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 212కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధర 1, 77, 309 వరకు ఉంది. తక్కువ ధరలో మంచి రేంజ్ కావాలనుకునే వారికి టీవీఎస్ ఆర్బిట్‌ సరిగా సరిపోతుంది. ఇది 158 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.

బజాజ్ చేతక్‌

బజాజ్ తన ఐకానికి చేతక్‌ను ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. చేతక్‌ 3001 నుంచి C3501 వరకు వివిధ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి రేంజ్‌ 127కిలోమీటర్ల నుంచి 153కిలోమీటర్ల వరకు ఉంటుంది. ధర 1,11, 785 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read:మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!

ఏథర్‌ ఎనర్జీ

ఏథర్ తన రిట్జా, 450X మోడల్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది. కుటుంబ అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్‌ 20 కంటే ఎక్కువ వేరియంట్లలో లభిస్తుంది. దీని రేంజ్ 123కిలోమీటర్ల నుంచి 159 కిలోమీటర్లలో లభిస్తుంది. గరిష్టంగా దీని ధర రూ. 1, 87, 641 వరకు ఉంది. ఏథర్‌ 450X స్పోర్టీ లుక్‌ కోరుకునే వారి కోసం 6.4kW మోటార్‌తో 161కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్స్ ఉన్నాయి. ఏథర్‌ 450S 1,31, 574 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్‌ను కూడా కలిగి ఉంది.

హీరో విడా

హీరో మోటోకార్ప్‌ విడా బ్రాండ్ కూడా మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తుంది. విడా vx2 142కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని ధర 1, 06, 872 నుంచి ప్రారంభమవుతుంది. విడా వీ2 ప్రో&ప్లస్‌ గరిష్టంగా 165కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.

Also Read:దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల

ఓలా ఎలక్ట్రిక్‌

ఓలా ఎస్‌Z 64, 343 రూపాయల ప్రారంభ ధరతో వస్తోంది. 46 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇవే కాకుండా రివర్‌ ఇండి స్కూటర్‌ను ఎస్‌యూవీగా పిలుస్తారు. ఇది 163కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇది 1, 54, 893 ధరతో ప్రారంభమవుతుంది. యమహా ఈసీ06 169 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కోమకి ఎస్‌ఈ ఆల్ట్రా మోడల్ 418 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్ చేస్తోంది. జెలో జూప్‌ అత్యంత తక్కువ ధరలో లభించే 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర 49, 110 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: Tata Altroz CNG AMT వెర్షన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు , ధ‌ర చూసి డిసైడ్ అవ్వండి

మీరు పెట్రోల్ ఖర్చుల నుంచి విముక్తి పొందాలని, పర్యావరణానికి మేలు చేయాలని భావిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్. టీవీఎస్ ఐక్యూబ్ వంటి నమ్మకమైన మోడల్స్ లేదా ఏథర్ రిట్జా వంటి ఫీచర్ రిచ్ స్కూటర్లు మీ ప్రయాణ అనుభవాన్ని మార్చేస్తాయి.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి