టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ వస్తున్నాయ్. అటువంటి సినిమాలు చేసే హీరోలలో ఒక హీరోకి ఫస్ట్ మాస్ హిట్ సినిమా వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ముందు ఆ సినిమా గురించి చెప్పాలంటే... 98 సెంట‌ర్లలో 100 రోజులు ఆడింది. 25 సెంట‌ర్లలో 175 రోజులు ఆడింది. సినిమాలో హీరో తొడ కొట్టారు. దెబ్బకు రికార్డులు సైతం బద్దలు అయ్యాయి. ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ఫాలో అవుతూ వచ్చిన ఆ సినిమా దర్శకుడికి అది మొదటి సినిమా. ఏకంగా నంది అవార్డు అందుకున్నారు. అసలు ఈ మాస్ ఫ్యాక్షన్ సినిమా ప్లేసులో ముందు ఓ ప్రేమ కథ చేయాలని అనుకున్నారు. అసలు ఆ సినిమా ఏమిటి? దాని వెనుక కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

ఎన్టీఆర్‌తో తొడ కొట్టించిన వినాయక్...
'ఆది'కి ముందు ప్రేమకథ చేయాలని!
ఎన్టీఆర్‌ (NTR)కు 'ఆది' సినిమా మాస్ ఇమేజ్‌ తెచ్చి పెట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఆ సినిమాతో వీవీ వినాయ‌క్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'ఆది' ప్లేసులో ఎన్టీఆర్‌ హీరోగా ఓ ల‌వ్‌ స్టోరీ చేయాల‌ని అనుకున్నారు వినాయ‌క్‌. కానీ...

హీరోగా ఎన్టీఆర్‌ నాలుగో సినిమా 'ఆది'. ఆయనకు మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ తెచ్చి పెట్టింది. ఆదికేశ‌వ‌రెడ్డి పాత్ర‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్‌, ఆయ‌న మ్యాన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆక‌ట్టుకున్నాయి. ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ ఫుల్ స్టోరీతో వినాయ‌క్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే 'ఆది' కంటే ముందే ఎన్టీఆర్‌కు వినాయ‌క్ ఓ ల‌వ్‌ స్టోరీ చెప్పారట‌. ఎన్టీఆర్‌కు ఆ క‌థ బాగా న‌చ్చింది. టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అంతా ఓకే, సెట్ అనుకున్నాక... ఆ సినిమాను ప‌క్క‌న‌పెట్టి 'ఆది' చేయాల్సి వ‌చ్చింది.

'శ్రీ'... 'ఆది'కి ముందు వినాయక్ రాసిన క‌థ‌
సాగ‌ర్‌తో పాటు ప‌లువురు దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వీవీ వినాయ‌క్... మంచి ల‌వ్‌ స్టోరీతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇవ్వాల‌ని అనుకున్నారు. తన తొలి సినిమా కోసం ఓ ఫీల్‌ గుడ్ క‌థ‌ రెడీ చేసుకొని ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లారు. ఆయన చెప్పిన ల‌వ్‌ స్టోరీ ఎన్టీఆర్‌కు తెగ న‌చ్చేసింది. ఆ సినిమాకు 'శ్రీ' టైటిల్‌ అనుకున్నారు. చిత్రీకరణ ప్రారంభించడమే త‌రువాయి అనుకుంటున్న త‌రుణంలో ఎన్టీఆర్, కొడాలి నాని ట్విస్ట్ ఇచ్చారట‌.

ఎన్టీఆర్ కోసం రెండు రోజుల్లో 'ఆది' రెడీ
వినాయక్ ప్రేమ కథ చెప్పిన టైమ్‌లో ఫ్యాక్ష‌నిజం ట్రెండ్ బాగా న‌డుస్తుండ‌టంతో ల‌వ్‌ స్టోరీ కాకుండా మంచి యాక్ష‌న్ సినిమా చేద్దామ‌ని కొడాలి నాని అన్నారట‌. దాంతో 'శ్రీ' క‌థ‌ను ప‌క్క‌న‌ పెట్టిన వినాయ‌క్... గాల్లోకి సుమోలు లేచే సీన్ ఒక‌టి ఎన్టీఆర్‌కు చెప్పారట‌. ఆ సన్నివేశానికి ఎన్టీఆర్ ఫ్లాటైపోయారట‌. ఫుల్ క‌థ‌ను రెడీ చేయ‌మ‌ని అన్నారట‌. దాంతో రెండు రోజుల్లో 'ఆది' ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి ఎన్టీఆర్‌కు వినిపించారు వినాయ‌క్‌. సింగిల్ ఛేంజ్ కూడా చెప్ప‌కుండా వెంటనే ఓకే చెప్పారు ఎన్టీఆర్. అలా ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్ష‌న్ సినిమా వచ్చింది.

Also Read: Viral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

'ఆది'తో మొదలైన ఎన్టీఆర్‌, వినాయ‌క్‌ కాంబినేషన్... తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్‌ స‌క్సెస్‌ ఫుల్ కాంబినేష‌న్‌లలో ఒకటిగా మారింది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆది, సాంబ‌, అదుర్స్‌ సినిమాలు బ్లాక్‌ బ‌స్ట‌ర్స్‌ అయ్యాయి. 'అదుర్స్' అయితే ఎంతో మందికి ఫేవరెట్. ఆ సినిమా సీక్వెల్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో 'అదుర్స్' సీక్వెల్ కోసం అరగంట కథ రెడీగా ఉందని కోన వెంకట్ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాల లైనులో అది చేస్తారో? లేదో?

Also Read: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?