తమిళనాడులో రాజకీయాలను, సినిమాను వేరు చేసి చూడలేం. అప్పటి ఎంజీఆర్, జయలలిత నుంచి ఇప్పటి దళపతి విజయ్ వరకు... పలువురు తారలు రాజకీయ తెరంగేట్రం చేయడంతో ఇతర భాషల ప్రేక్షకులూ తమిళ రాజకీయాలను ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం తమిళనాట విజయ్ వ్యవహారం వాడి వేడిగా ఉంది. ఈ తరుణంలో వచ్చిన 'టీఎన్ 2026' టీజర్ దళపతి అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకు కారణం ఏమిటి? అసలు ఆ టీజర్‌లో ఏం ఉంది? వంటి వివరాల్లోకి వెళితే...

విజయ్ వర్సెస్ నట్టీ... లుక్ ఒక్కటేగా
'టీఎన్ 2026'... తంగ నచ్చతిరం 2026... అంటే తమిళ నక్షత్రం అని అర్థం. ఈ సినిమాకు 'టైమ్ టు లీడ్' (నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది) అనేది ఉప శీర్షిక. ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తే... ఉత్తరాది నుంచి వచ్చి తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి, తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తాడు. అతని కథ ఏమిటి? అనేది తెరపై చూడాలి. ఏప్రిల్ 10న సినిమా విడుదల.

'టీఎన్ 2026' టీజర్‌లో కథకు, విజయ్ (Thalapathy Vijay)కు సంబంధం లేదు. ఆ కథ ఉత్తరాది నుంచి తమిళనాడు వచ్చి హీరోగా ఎదిగిన వ్యక్తిది. విజయ్ స్వస్థలం తమిళనాడే. ఆయన తండ్రి తమిళ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. పాత్ర పరంగా పోలికలు ఏమీ లేవు. కానీ, లుక్ చూస్తే... విజయ్‌ను డిట్టో దింపేశారు నట్టి. దాంతో దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. 'టీఎన్ 2026' టీజర్ విమర్శలకు దారి తీసింది.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

విజయ్ హీరోగా నటించిన 'యూత్', 'పులి' చిత్రాలకు నట్టి నటరాజ్ (నటరాజన్ సుబ్రమణియన్) సినిమాటోగ్రాఫర్. ఇప్పుడీ 'టీఎన్ 2026'లో ఆయనే హీరో. విజయ్ లుక్కులో క్యారెక్టర్ చేసినది ఆయనే. నట్టీకి గానీ, తనకు గానీ విజయ్ ని విమర్శించే ఉద్దేశం లేదని, తాను విజయ్ సినిమాల్లో నటించానని... తమ 'టీఎన్ 2026' సినిమా చూసి మాట్లాడమని కీలక పాత్రలో నటించిన తంబి రామయ్య చెబుతున్నారు. విజయ్ పార్టీ టీవీకేని టార్గెట్ చేస్తూ సినిమా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 10 తర్వాత ఏం అవుతుందో చూడాలి.

Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

జగన్ నుంచి విజయ్ మీదకు వెళ్లిన లుక్!
నట్టి నటరాజ్ లుక్ చూసి సేమ్ టు సేమ్ విజయ్ టైపులో ఉన్నారని తమిళ ప్రజలే కాదు... ఇతర భాషల ప్రేక్షకులు సైతం అనుకుంటున్నారు. అయితే... మొదటి ఈ సినిమాలో హీరో లుక్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఉంటే బావుంటుందని ప్లాన్ చేశామని, అయితే ఆయన్ను వెక్కిరించినట్టు ఉండకూడదని కొన్ని మార్పులు చేశాక విజయ్ లుక్ వచ్చేసిందని నట్టి నటరాజ్ తెలిపారు. 'టీఎన్ 2026' షూటింగ్ చేసేటప్పుడు అయితే కొంతమంది తనను చూసి విజయ్ అనుకుని ఫోటోలు దిగారని ఆయన చెప్పారు. సినిమాలో నాలుగు లుక్కులో కనిపిస్తానని తెలిపారు. అన్నట్టు... త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నితిన్ 'అ ఆ'కు నట్టి సినిమాటోగ్రాఫర్. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ కూడా అయ్యాయి.

'టీఎన్ 2026' సెన్సార్ పూర్తి అయ్యింది. సో... థియేటర్లలో సినిమా విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవు. ఏప్రిల్ 10న ఎవరినైనా టార్గెట్ చేస్తూ సినిమా తీశారా? లేదంటే వినోదాత్మక సినిమానా? అనేది తెలుస్తుంది. అప్పటి వరకు తమిళ ప్రజలు, ప్రేక్షకులకు సస్పెన్స్ తప్పదు. జగన్ మోహన్ రెడ్డి తరహాలో లుక్ ప్లాన్ చేస్తే ఇక్కడ వైసీపీ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండేదో?

Also Read: Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?