Natty Subramaniam's TN 26 Movie OTT Telugu Streaming : తమిళనాడు ఎన్నికల ముందు రెండు మూవీస్ కాంట్రవర్సీగా మారాయ్. ఒకటి దళపతి విజయ్ నటించిన జన నాయగన్ అయితే రెండోది నట్టి సుబ్రమణియం నటించిన 'టీఎన్ 2026' (TN 2026). జన నాయగన్‌తో పాటే ఈ మూవీ కూడా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది.

పలు కాంట్రవర్సీస్ తర్వాత ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 3 వారాల తర్వాత ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి వచ్చినా తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు. తాజాగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

'టీఎన్ 2026' (TN 2026) మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తెలుగుతో పాటు తమిళం, హిందీలో అందుబాటులో ఉంది. అలాగే, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా... ఆయన కుమారుడు ఉమాపతి దర్శకత్వం వహించారు.

దళపతి విజయ్‌ను, టీవీకే పార్టీని టార్గెట్ చేసి ఈ మూవీ తీశారంటూ నెట్టింట ట్రోలింగ్ సాగింది. ఫస్ట్ లుక్, టీజర్‌తోనే విజయ్ ఫ్యాన్స్ సినిమాపై విమర్శలు గుప్పించారు. మూవీ రిలీజ్ కాకుండా కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే, అవేవీ వర్కౌట్ కాలేదు. నట్టి సుబ్రమణియంతో పాటు శ్తిత రావు, తంబి రామయ్య, చాందిని తమిళరసన్, మహేశ్ దేవి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?