Tirumala News: అన్యమత ఉద్యోగులను ఇంటికి పంపుతున్న టీటీడీ - తొలి విడతగా 18 మందికి ఆర్డర్స్

10 months ago 8
ARTICLE AD
<p>18 Non Hindu employees were transferred in Tirumala : అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు ప్రారంభించింది. &nbsp;పద్దెనిమిది మందిని బదిలీ చేస్తూ నిర్ణయంతీసుకున్నారు. టీటీడీ మహిళ&zwnj; పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు.టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్యమతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొండపై మాంసాహారం, గంజాయి, మద్యం దొరుకుతున్నాయని, దీనివల్ల తిరుమల క్షేత్రం పవిత్రత దెబ్బతింటోందని, అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;</p> <p>టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్య మత ఉద్యోగుల్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. వెంటనే ఇతర మతాలకు చెందిన వారి వివరాల్ని సేకరించారు.ఇప్పుడు &nbsp;టీటీడీలో పని చేస్తూ అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను టీటీడీ రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుర్తించారు. దీంతో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో ప్రస్తుతం మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.&nbsp;</p> <p>నేరుగా క్రైస్తవులు గా ఉన్న వారిని గుర్తించడం సులువే కానీ మతం మారిన వారిని గుర్తించడం టీటీడీ వర్గాలకు సవాల్ గా మారింది. మతం మారిన వారు గుట్టుగా అన్యమత ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి ఆదాయాన్ని జీతంగా తీసుకుంటూ శ్రీవారిపై నమ్మకం లేకుండా వ్యవహరించే వారిని పట్టుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. గతంలో చీఫ్ సెక్రటరిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఆయన అనుమానం ఉన్న ఉద్యోగుల ఇంటికి నేరుగా వెళ్లి పరిశీలన చేసేవారు. అప్పట్లో పలువురు ఇలా మతం మారిన ఉద్యోగుల్ని పట్టుకున్నవారు. తర్వాత ఆయన హఠాత్తుగా బదిలీ అయ్యారు.&nbsp;</p>
Read Entire Article