IPL 2026 MI VS GT Live Updates: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2008లో ముంబై ఇండియన్స్ తరపున సనత్ జయసూర్య నెలకొల్పిన 'ఫాస్టెస్ట్ సెంచరీ' (45 బంతుల్లో) రికార్డును ఇప్పుడు తిలక్ వర్మ సమం చేశాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఈ తెలుగు కుర్రాడు కొండంత అండగా నిలిచాడు.

The joint-fastest hundred for @mipaltan scoring 101* (45) 💙

Now, that’s how you notch up your maiden #TATAIPL hundred 👏👏#KhelBindaas | #GTvMI | @TilakV9 pic.twitter.com/njI6I30vMH

— IndianPremierLeague (@IPL) April 20, 2026

పాండ్యా క్లాస్ , తిలక్ మాస్..
ఈ ఇన్నింగ్స్ ప్రారంభంలో తిలక్ వర్మ చాలా ఇబ్బంది పడ్డాడు. పవర్‌ప్లేలో కాగిసో రబడా నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను వణికించాడు. తిలక్ కూడా 22 బంతులు ఆడి కేవలం 19 పరుగులే చేసి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆ సమయంలో నరేంద్ర మోడీ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా అతన్ని ఆటపట్టించారు. అయితే 14వ ఓవర్ తర్వాత జరిగిన స్ట్రాటజిక్ టైమ్-అవుట్ వద్ద సీన్ మొత్తం మారిపోయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిలక్ దగ్గరకు వెళ్లి కొంచెం సీరియస్‌గా మాట్లాడాడు. స్కోరు బోర్డును ముందుకు నడిపించాల్సిందిగా గట్టిగా చెప్పాడు. ఆ 'హార్డ్ టాక్' తర్వాత మనం పాత తిలక్ వర్మను చూశామని ముంబై అభిమానులు పేర్కొంటున్నారు.

గుజరాత్ బౌలర్లపై తాండవం..
బ్రేక్ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక దశలో 23 బంతుల్లోనే 81 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గుజరాత్ ఫాస్ట్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్‌లో 19 పరుగులు, కొత్త సంచలనం అశోక్ శర్మ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అంతకుముందు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 43 పరుగులే చేసిన తిలక్, ఈ మ్యాచ్‌లో మాత్రం 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం ఆరు ఓవర్లలోనే ముంబై 96 పరుగులు సాధించడంలో తిలక్ పాత్ర ఎంతో కీలకమని తెలుస్తోంది.

రబడా సూపర్బ్ స్పెల్ ..
నిజానికి ఈ మ్యాచ్‌లో కాగిసో రబడా తన బౌలింగ్‌తో ముంబై టాపార్డర్‌ను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. డానిష్ మలేవార్, క్వింటన్ డికాక్ వంటి కీలక వికెట్లను తీసుకుని ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ (15) ను 152 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌కే హైలైట్. అటువంటి క్లిష్ట సమయంలో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసి ముంబై స్కోరును 199/5 కు చేర్చాడు. కెప్టెన్ పాండ్యా (15) తన బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా, తిలక్‌ను ప్రోత్సహిస్తూ 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ పూర్తి కాగానే తిలక్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.