Upcoming Telugu Movies In Theaters OTT Releases In October 2nd Week: పవన్ కల్యాణ్ 'OG', దసరా సందర్భంగా రిలీజ్ అయిన రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1', ధనుష్ 'ఇడ్లీ కొట్టు' థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాయి. మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ఈ వారం కూడా కొత్త మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అటు ఓటీటీల్లోనూ కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌‌లు అందుబాటులోకి రానున్నాయి.
అనసూయ 'అరి'
ఫేమస్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సైకో మైథలాజికల్ థ్రిల్లర్ 'అరి'. 'పేపర్ బాయ్' మూవీ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించగా... సాయి కుమార్, వినోద్ వర్మ, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరిషడ్వర్గాలే ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఎప్పుడో రిలీజ్ పనులు కంప్లీట్ కాగా వివిధ కారణాలతో మూవీ రిలీజ్ వాయిదా పడింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్'
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్'. ఆర్యన్ సుభాన్ ఎస్ కె దర్శకత్వం వహించిన ఈ మూవీని జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. వరుణ్ సరసన మధులిక వారణాసి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే దువ్వాసి మోహన్, రవివర్మ, సూర్య, ప్రభావతి, నిత్యశ్రీ, కల్పలత, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న సినిమా థియేటర్లలోకి రానుంది.
గోదారి అందాల లవ్ స్టోరీ 'శశివదనే'
టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్యూట్ లవ్ ఎంటర్‌టైనర్ 'శశివదనే'. గోదారి జిల్లాల నేపథ్యంలో సాగే లవ్ స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ప్రాధాన్యంగా మూవీని తెరకెక్కించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించగా... <!--StartFragment -->శ్రీమతి గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'కొత్త లోక' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?