September Last Week OTT Movies Complete List : ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే, ఓటీటీలోనూ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీస్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 26 వరకూ థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

ది ప్యారడైజ్ - నేచరల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise). పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సెప్టెంబర్ 24 (గురువారం) నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు.

అనుమాన పక్షి - యంగ్ హీరో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి (Anumana Pakshi). ఈ మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా... సెప్టెంబర్ 25న (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది.

కల్యాణం కమనీయం జీవితం - ఖాన్ దురానీ, సాహితీ ఆవంచ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కల్యాణం కమనీయం జీవితం. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రేమనే ఊరిలో - శ్రీరామ్, రమిక శివు, తపస్విని ప్రధాన పాత్రల్లో నటించిన విలేజ్ లవ్ డ్రామా ప్రేమనే ఊరిలో. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది.

Also Read : Thaman Reaction : ది రాజా సాబ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి కన్నీళ్లు - నాకు ఏడుపు రాలేదంటూ తమన్ ఫన్ సెటైరికల్ రియాక్షన్