This Week OTT Releases In Different Platform Complete List : థియేటర్లలో ఈ వారం తెలుగు మూవీస్ గాయపడ్డ సింహం, జెట్లీతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ రీసెంట్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్‌తో పాటు సోషల్ డ్రామా, కామెడీ, హారర్, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్స్ సందడి చేయనున్నాయి.

హారర్ ఫాంటసీ 'రాకాస'

టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ రాకాస. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

శర్వానంద్ 'బైకర్'

యంగ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా నిలిచింది. శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. శర్వా తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

లెజండ్ శరవణన్ 'లీడర్'

లెజెండ్ శరవణన్ రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లీడర్. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా... పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సోషల్ డ్రామా 'ది కేరళ స్టోరీ 2 '

రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీస్ క్రియేట్ చేసిన 'ది కేరళ స్టోరీ 2' మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా... ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్యా ఓజా, సుమిత్ గహ్లావత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని - బెస్ట్ ఫ్యాన్ మూమెంట్... కర సామి రియాక్షన్ వైరల్