This Week OTT Releases Complete List : ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 7 వరకూ ఓటీటీల్లో డిఫరెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ నుంచీ లవ్ రొమాంటిక్ మూవీస్, కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్‌ల వరకూ అలరించనున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే...

కొరియన్ కనకరాజు - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన రీసెంట్ హారర్ కామెడీ డ్రామా 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

DC - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హీరోగా నటించిన లోకేశ్ కనగరాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా... మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఉన్మాదం (Unmadham) - మలయాళ స్టార్ కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉన్మాదం (Unmadham). జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... సోనీ లివ్ (Sonyliv)లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

గాంధారి - టాలీవుడ్ బ్యూటీ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' (Gandhari). దేవాశీష్ మఖీజా దర్శకత్వం వహించగా... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కానుంది. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

జగమే సంగీతం - పాన్ ఇండియా యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ జగమే సంగీతం. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Crime Thriller OTT : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఫ్రెండ్ మిస్టీరియస్ డెత్... ఏఎస్సై బబిత ఏం చేసింది?