This Week OTT Movies Complete List : ఈ వారం ఓటీటీల్లో యాక్షన్ ఎంటర్టైనర్స్ నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకూ స్ట్రీమింగ్ కానున్నాయి. సోమవారం (మే 25) నుంచి ఆదివారం (మే 31) వరకూ డిఫరెంట్ ఓటీటీల్లో అందుబాటులోకి రాబోయే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో ఓసారి చూస్తే...

ధనుష్ 'కర'

కోలీవుడ్ స్టార్ ధనుష్, ప్రేమలు ఫేం మమితా బైజు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ రూరర్ యాక్షన్ థ్రిల్లర్ కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

శరవణన్ 'లీడర్'

ఫేమస్ బిజినెస్ మ్యాన్, లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లీడర్. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... శరవణన్‌తో పాటు పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 29 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కమెడియన్ సత్య 'జెట్లీ'

కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' ఓటీటీలోకి వచ్చేసింది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సత్యతో పాటు వెన్నెల కిశోర్, అజయ్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్