Prabhas's The Raja Saab Movie Shooting In Europe: పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ అవెయిటెడ్ రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజా షెడ్యూల్‌ను టీం ప్లాన్ చేసింది.

యూరప్‌లో మూవీ టీం

ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ దశకు చేరుకోగా... మూవీ టీం కొత్త షెడ్యూల్ కోసం యూరప్ చేరుకుంది. ఇందులో భాగంగా హీరో హీరోయిన్లపై 2 సాంగ్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా... ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వింటేజ్ ప్రభాస్‌ను చూపించారు డైరెక్టర్ మారుతి.

టీజర్, ట్రైలర్లలో డార్లింగ్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా విజువల్స్‌పై ప్రశంసలు కురిపించారు. 'ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంతకు మించిన సర్ ప్రైజెస్, ఎలిమెంట్స్, సూపర్ లుక్స్ మూవీలో ఉన్నాయి. ఎగ్జైట్మెంట్ కొంచెం దాచి పెట్టుకోండి. ఇంతటి అభిమానానికి థాంక్స్' అంటూ ట్రైలర్ రిలీజ్ తర్వాత మారుతి కామెంట్స్ చేశారు. దీంతో హైప్ పదింతలు అవుతోంది.

Also Read: బాలయ్య హిస్టారికల్ ఎపిక్ 'NBK111' - షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్... గెట్ రెడీ ఫర్ బిగ్ సర్‌ప్రైజెస్