The Legend of Kirtimukha: దిష్టి నుంచి రక్షించే దెయ్యం రహస్య కథ! దాని మూలం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

3 days ago 2
ARTICLE AD

Nazar Battu Mythology Story: ఇంట్లోకి చెడు దృష్టి ప్రవహించకుండా ఇంటి గోడలపై నజర్ బట్టు బొమ్మను పెడుతుంటారు చాలామంది. గుండ్రని ఆకారం, బయటకు చాచిన నాలుక, తలపై రెండు కొమ్ములు, పొడవాటి చెవులతో ఒక రాక్షసుడిలా కనిపిస్తుంది. ఇది చెడు దృష్టి , ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది.

ఇదెలా పుట్టింది?

దిష్టి తొలగించేందుకు ఎందుకు వినియోగిస్తారు?

దానివెనుకున్న పౌరాణిక కథేంటి?

నజర్ బట్టు గురించి ఆసక్తికరమైన కథ ఇది..

పురాణాల ప్రకారం, పూర్వకాలంలో జలంధర్ అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. జలంధర్ పార్వతీ దేవిని పొందాలని కోరుకుని, శివుడిని ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. పార్వతీ దేవిని పొంది, శివుడిని యుద్ధానికి సవాలు చేయడానికి, జలంధర్ తన దూత అయిన రాహువును కైలాస పర్వతానికి పంపాడు. రాహువు మాటలు విని శివుడు ఎంతగానో ఆగ్రహానికి గురయ్యాడు, ఆ ఆగ్రహం నుంచి ఓ కొత్త జీవి జన్మించింది. శివుని ఆగ్రహం నుంచి పుట్టిన ఈ జీవి పూర్తిగా మానవ రూపంలోనూ లేదు, రాక్షస రూపంలోనూ లేదు. అది అన్నింటినీ మింగివేయాలని కోరుకుంది. ఆ భయంకరమైన జీవి శివుడిని, "నేను ఎవరిని తినాలి?" అని అడిగింది. శివుడు, "నిన్ను నువ్వే తిను" అని బదులిచ్చాడు. శివుని ఆజ్ఞను అనుసరించి, ఆ జీవి తన శరీరం మొత్తాన్ని తినేసింది. శరీరాన్ని తిన్న తరువాత, అది మళ్ళీ శివుడిని, "ఇప్పుడు నేను ఏం తినాలి?" అని అడిగింది. ఆ జీవి మాటలకు శివుడు ఎంతగానో సంతోషించి, దానికి కీర్తిముఖ అని పేరు పెట్టాడు.

ఈ 'దిష్టి' ట్రిక్కులు నిజంగా పనిచేస్తాయా? GenZ ఆలోచనా విధానం ఎలా ఉంటోంది తెలుసుకోండి!

కీర్తిముఖుడు

కీర్తిముఖుడు సంపదకు చిహ్నం. శివుడు కీర్తిముఖునికి ఒక వరం ఇస్తూ, "నన్ను చేరేలోపు నువ్వు అందరి దురాశ, మోసం, కపటం , ప్రతికూల భావాలను భక్షించుకుంటావు" అని చెప్పాడు. అందుకే ఇళ్లలో కీర్తిముఖ రూపాన్ని తరచుగా చూస్తుంటాం. కీర్తిముఖ చిత్రాన్ని ఎక్కడ ఉంచినా, అక్కడకు ప్రతికూల శక్తి ప్రవేశించదని నమ్ముతారు. కీర్తిముఖ గురించిన ఈ జానపద కథ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, క్రమంగా అది దిష్టి అనే రూపాన్ని సంతరించుకుంది.

వాస్తు ప్రకారం నజర్ బట్టుని ఎక్కడుంచాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం కీర్తిముఖుడిని ప్రధానంగా ఇంటి ఎంట్రన్స్ మెయిన్ డోర్ పై వేలాడదీయాలి. డోర్ కి అభిముఖంగా ఉంచాలి. ఇది దుష్ట శక్తులను, నెగెటివ్ ఎనర్జీని, దిష్టిని లోపలకు రాకుండా భక్షిస్తుందని నమ్మకం. ఆఫీస్ లేదా వ్యాపార స్థలం మెయిన్ డోర్ పైన కూడా కీర్తిముఖుడి బొమ్మ పెట్టొచ్చు. ఇంట్లో అయితే ఈశాన్య దిశలో పెడితే మరింత మంచిది. పడకగదిలో కానీ నేలపై కానీ ఊ బొమ్మను పెట్టకూడదు. ఎత్తుగా ఉంచాలి.. ఇంట్లో పెట్టినా, బయట డోర్ దగ్గర పెట్టినా ఆ బొమ్మ ముఖం బయటకు చూసేలా ఉంచాలి. వాస్తు ప్రకారం ఇది సంపదను వృద్ధిచేసే శక్తివంతమైన సింబల్ గా పరిగణిస్తారు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Read Entire Article