Kerala High Court Stays Release Of The Kerala Story 2 Movie : 'ది కేరళ స్టోరీ 2' మూవీకి రిలీజ్‌కు ఒక్క రోజు ముందు బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ రిలీజ్‌పై కేరళ హైకోర్టు స్టే విధించింది. CBFC తీరును తప్పుపట్టిన హైకోర్టు పునః పరిశీలించాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. అప్పటివరకూ మూవీ ప్రదర్శన నిలిపేయాలని స్పష్టం చేసింది.

2023లో రిలీజైన 'ది కేరళ స్టోరీ' మూవీపై కూడా రిలీజ్‌కు ముందు ఎన్నో కాంట్రవర్సీస్ నెలకొన్నాయి. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా సీన్స్ ఉన్నాయని... కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసే అంశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రైలర్‌ను చూసి చాలా మంది ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ మూవీని తీవ్రంగా తప్పుపట్టారు.

మూవీ U/A సర్టిఫికెట్...

సెన్సార్ బోర్డ్ 'ది కేరళ స్టోరీ 2'కు U/A సర్టిఫికెట్ ఇవ్వడంపై మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు మూవీ రిలీజ్‌పై స్టే విధించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ముందుగా సినిమాను చూసిన తర్వాతే సెన్సార్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. గురువారం సినిమాను చూసిన తర్వాత CBFC తీరును తప్పుపట్టిన కోర్టు... సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని విడుదలపై స్టే విధించింది.

సమాజంలో విధ్వేషాలను రెచ్చగొట్టేలా, ఓ వర్గాన్ని కించ పరిచేలా ఉన్న దృశ్యాలను ఎలా అనుమతిస్తారంటూ సెన్సార్ బోర్డు సభ్యులను కోర్టు ప్రశ్నించింది. మూవీని పునః పరిశీలన చేయాలని సూచించింది. అప్పటివరకూ మూవీ రిలీజ్‌కు అవకాశం లేదు.

Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ - పసందైన విందు భోజనం... మెనూలో నేషనల్ క్రష్‌కు ఇష్టమైన స్వీట్స్