'తండేల్' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 7న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను జోరుగా కొనసాగిస్తుంది. అయితే మరోవైపు ఈ మూవీ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అలాగే 'తండేల్' మూవీ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'లవ్ స్టోరీ' సినిమాలో వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. 'లవ్ స్టోరీ' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం వెనకున్న కారణాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఒకటి. ఇక ఇప్పుడు 'తండేల్' మూవీలో మరోసారి కలిసి నటిస్తోంది ఈ జంట. ఇందులో సాయి పల్లవి బుజ్జి తల్లిగా నటిస్తుండగా, నాగ చైతన్య 'తండేల్' రాజుగా కనిపించబోతున్నారు. మత్స్యకారుల నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించడానికి ఇటు నాగ చైతన్యతో పాటు, అటు సాయి పల్లవి కూడా బాగానే కష్టపడింది.

వీరిద్దరూ మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వర్క్ షాప్స్ లఓ పాల్గొన్నారు. అలాగే వారి భాషను, యాసను కూడా నేర్చుకున్నారు. ఫలితంగా ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'తండేల్' ప్రమోషనల్ కంటెంట్ లో వీరి కష్టం క్లియర్ గా కనిపించింది. ఇక మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో, మరి ఈ ఇష్టమైన కష్టానికి నాగ చైతన్య, సాయి పల్లవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం నాగ చైతన్య రూ. 15 కోట్లు, సాయి పల్లవి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తలు గనక నిజమైతే నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరి కెరీర్ లోనూ ఇదే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది.

Also Read: ఉరి తీసిన 2 గంటల తర్వాత కూడా ఊపిరితో... రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

'తండేల్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇక మరోవైపు 'తండేల్' మూవీ థియేటర్లలోకి రాకముందే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారీ అంచనాలతో ఈ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని వార్తలు వినిపించాయి. తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందూ మొండేటి 'తండేల్' మూవీని రూ. 90 కోట్ల బడ్జెట్లో నిర్మించామని, రూ.65 కోట్ల భారీ ధరకు ఓటీటీ డీల్ కుదిరిందని స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా 'తండేల్' మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని చందూ వెల్లడించారు. అంటే మార్చ్ చివరి వారంలో 'తండేల్' డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందన్నమాట.

Also Read: 'తండేల్'తో పోటీ... 25 కుక్కలతో క్లైమాక్స్ షూట్... సాయి రామ్ శంకర్ క్లారిటీ