అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ 'తండేల్'. నాగ చైతన్యతో పాటు చిత్ర బృందం మొత్తం ఈ మూవీతో ఎలాగైనా సరే హిట్ కొట్టబోతున్నామని గట్టి నమ్మకంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా హైప్ కూడా ఉంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న 'తండేల్' మూవీపై అన్ని భాషల్లోనూ మంచి బజ్ నెలకొంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న 'తండేల్' మూవీ గురించి అక్కినేని అభిమానులు సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'తండేల్' మూవీ ఎలా ఉంది ? అన్న ఇన్సైడ్ టాక్ బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం సినిమాలోని హైలెట్స్ వింటుంటే మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

'తండేల్' మూవీ హైలెట్స్
ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం 'తండేల్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికే మూవీకి సంబంధించి వేసిన స్పెషల్ ప్రీమియర్ల టాక్ ప్రకారం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అలాగే ఈ మూవీలో ఊహించిన దానికంటే ఎక్కువగానే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో సాయి పల్లవి - నాగచైతన్య మధ్య నడిచే లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన 3 పాటలు ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించబోతున్నాయి. ఎమోషన్స్ విషయానికి వస్తే... పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... వీఎఫ్ఎక్స్ బోట్ సీన్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని అంటున్నారు. సాధారణంగా సినిమా అంటే ఫ్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. 'తండేల్' ఇంటర్వెల్లో లాస్ట్ 22 నిమిషాల సీన్స్, అలాగే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా అని సమాచారం. ఈ టాక్ ప్రకారం చూసుకుంటే నాగచైతన్య తన కెరీర్ లోనే బెస్ట్ హిట్ తో రాజులమ్మ జాతర చేసుకోవడం ఖాయమని అన్పిస్తోంది. ఇప్పటికే అల్లు అరవింద్ ఈ సినిమాకు 100 మార్కులు ఇచ్చేసారని, ఇక రాజులమ్మ జాతరే అంటూ నిర్మాత బన్నీ వాసు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్

'తండేల్'కు పెరిగిన టికెట్ ధరలు
కాగా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రాబోతున్న 'తండేల్' మూవీకి డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాకు ఏపీలో మొదటి ఏడు రోజులు సింగిల్ స్క్రీన్ లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ. 75 టికెట్ పెంపుకు అనుమతి లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్ లో రూ.197, మల్టీప్లెక్స్ లో రూ. 252గా ఏపీలో టికెట్ ధరలు ఉండబోతున్నాయి. అలాగే తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ. 177 మల్టీప్లెక్స్ లో రూ.295 గా ఉండబోతోంది.

Also Read: వందకు పైగా సినిమాల్లో నటించిన పుష్పలత ఇకలేరు... యాక్టింగ్ మానేశాక ఏం చేశారు? కూతురూ హీరోయినే అని తెల్సా?