దర్శకుడిగా 'బ్లేడ్ బాబ్జి', 'కెవ్వు కేక', 'మిస్టర్ పెళ్లికొడుకు' వంటి సినిమాలతో దేవి ప్రసాద్ విజయాలు అందుకున్నారు. అయితే... ఇప్పుడు ఆయన నటుడిగా బిజీ అయ్యారు. 'నీది నాదీ ఒకే కథ' తర్వాత వరుస అవకాశాలు రావడంతో యాక్టింగ్ కెరీర్ బిజీ అయ్యింది. ఇప్పుడు ఆయన ఓ కొత్త సినిమా ఓకే చేశారు. టైటిల్ ఖరారు చేయని ఆ సినిమా పూజతో మొదలైంది.

జగన్ యోగి రాజ్ హీరోగా...
దేవి ప్రసాద్ ప్రధాన పాత్రలో & జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల జంటగా హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా శనివారం మొదలైంది. ఈ సినిమాతో హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర తారాగణం.

Also Read: Adivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?

చిత్ర నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా అంటే నాకు ప్రేమ, బాధ్యత, అభిరుచి. అందుకే నిర్మాణంలో అడుగు పెట్టాను. హన్సి ప్రొడక్షన్స్ సంస్థలో నా తొలి చిత్రాన్ని ప్రారంభించాం. ఇదొక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఉన్నాయి'' అని చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల చెప్పారు.

Also Read: Rashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?

జగన్ యోగిరాజ్, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ప్రధాన పాత్రలు. పోషిస్తున్నారు ఈ చిత్రానికి సహ నిర్మాత: తవిటిరాజు తలచింతల, ఛాయాగ్రహణం: సాయి వంశీ దాచపల్లి, కూర్పు: ఉదయకిరణ్ ఏవీ, సంగీత దర్శకుడు: రాజీవ్ రాజ్, కళా దర్శకుడు: శ్రీపాల్ మాచర్ల.

Also Read: Sangeetha Sornalingam: ఎవరీ సంగీత సోర్నలింగం? దళపతి విజయ్‌ను ఎలా కలిశారు? ప్రేమ - పెళ్లి కహానీ తెలుసుకోండి