Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ

1 week ago 1
ARTICLE AD
<p>Telangana high Court verdit on Panchayat Elections | హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైన పిటిషన్&zwnj;పై ఈ తీర్పు ఇచ్చింది. &nbsp;వెనుకబడిన కుల సంఘాలు (BC Group) గురువారం తెలంగాణ హైకోర్టులో ఎన్నికలపై స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) రిజర్వేషన్లు కేటాయించాలని, అప్పటివరకూ ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.&nbsp;</p> <p>బీసీ సామాజికవర్గంలో ఏ, బీ, సీ, డీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు ఇదివరకే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ &nbsp;మొదలైనందున, ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు దశలలో తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు.</p>
Read Entire Article