Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు

2 weeks ago 2
ARTICLE AD
<p>ఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు (నవంబర్ 17న) మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్&zwnj; గడ్డం ప్రసాద్ కుమార్&zwnj;పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "అనర్హత అంశంపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా?" అని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్&zwnj;ను గట్టిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తెలంగాణ స్పీకర్&zwnj;కు కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.</p> <p>నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్&zwnj;కు సుప్రీంకోర్టు నోటీసులలో పేర్కొంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ సూచించారు. దీనికి ప్రతిస్పందనగా, స్పీకర్&zwnj; తరఫు లాయర్లు నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.</p> <p>BRS దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్&zwnj; బీఆర్&zwnj; గవాయ్&zwnj; నేతృత్వంలోని ధర్మాసనం జులై 31న తెలంగాణ స్పీకర్ ను ఆదేశించింది. అయితే పలు కారణాలవల్ల నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాలేదని, మరో 2 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్&zwnj; అప్లికేషన్&zwnj; సీజేఐ ధర్మాసనం ముందు 14వ నంబరులో లిస్ట్&zwnj; చేశారు. కేటీఆర్&zwnj; దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్&zwnj; 36వ నంబరులో ఉంది. మరో రిట్&zwnj; పిటిషన్&zwnj; 37వ నంబరులో లిస్ట్&zwnj; అయింది. అయితే పిటిషన్లపై విచారణ చేపట్టి తేల్చేందుకు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ కు 4 వారాల గడువు ఇచ్చింది.&nbsp;</p>
Read Entire Article