Telangana local election BC reservation GO: తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (BC) కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో వాగ్దానం చేసిన ఈ BC కోటా జీవో నెంబర్ 9 విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశంఉందని అధికారులు తెలిపారు. ఈ లోపు అధికారులతోఎస్‌ఈసీ సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Reservation of 42% of seats and positions in Local bodies for BCs in Telangana State#Telangana #LocalBodyElections pic.twitter.com/dTKmseiqZB

— Congress for Telangana (@Congress4TS) September 26, 2025

అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న BC కోటాను 42%కు పెంచే బిల్లులు ఆమోదించారు. ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, SC, ST, BCలకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్ లో ఉన్నాయి.

డెడికేటెడ్ BC కమిషన్ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% BC కోటా నిర్ణయించారు. ఈ కోటాలో మహిళలకు 50% సబ్-కోటా కూడా ఉంటుంది. జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌ను సీల్డ్ కవర్లలో పంచాయతీ రాజ్ విభాగానికి సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు (MPP), జిల్లా పరిషత్తులు (ZP)లో BC, SC, ST కోటాలు నిర్ణయిస్తారు. జీవో విడుదలైనందున వెంటనే పంచాయతీ రాజ్ విభాగం SECకు సిఫార్సు చేస్తుంది. SEC ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది.

ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో ZP చైర్మన్‌లు (31), ZPTCలు (566), MPP ప్రెసిడెంట్లు (566), MPTCలు (5,773) ఎన్నికలు. రెండో దశలో గ్రామ పంచాయతీలు (13,000+) జరుగుతాయి. అయితే ఈ జీవో చెల్లుబాటుపై సందేహాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న తెలంగాణ హైకోర్టు, 42% BC కోటాపై పిటిషన్‌ను తిరస్కరించింది. "GO జారీ కాలేదు, తొందరపడి పిటిషన్ వేశారు" అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీవో జారీ అయినందుకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.