Rangareddy Land Survey Assistant Director Srinivasulu Corruption: తెలంగాణ యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్‌మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు అవినీతి బాగోతాన్ని బయట పెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించింది. రాయదుర్గం‌లోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితులు, బెనామీలు, సహచరులకు సంబంధించిన 7 చోట్ల ఒకే సారి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లో 33 ఎకరాల వ్యవసాయ భూములు, 7 ప్లాట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్, ఫ్లాట్, వాహనాలు, నగదు, బంగారం, వెండి సహా లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కనుగొన్నారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రెండు వందల కోట్లకుపైగానే ఉండే అవకాశం ఉంది.

రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం, రాయదుర్గం‌లోని మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాసులు నివసిస్తున్న ఫ్లాట్, నారాయణపేట, మహబూబ్‌నగర్, ఆనంద్‌పూర్, కర్ణాటకలోని ఆస్తులకు సంబంధించిన చోట్ల ACB టీమ్‌లు సోదారులు చేశాయి. HYDRAA కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆగస్టు 30, 2024న ఫిర్యాదు చేసినట్లు ACB తెలిపింది. ఈ ఫిర్యాదులో నిజాంపేట్ మున్సిపాలిటీలోని ఎర్రకుంట చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఈ కారణంగా రంగనాథ్ ఫిర్యాదు చేశారు.

శ్రీనివాసులు తన సర్వీసు కాలంలో అవినీతి , అసాధారణ మార్గాల ద్వారా ఆస్తులు సేకరించారని ACB తేల్చింది.

శ్రీనివాసులు ఆస్తుల వివరాలు

- హైదరాబాద్ మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్
ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు రైస్ మిల్.
వ్యవసాయ భూములు
నారాయణపేటలో 11 ఎకరాలు.
ఆనంతపురంలో 11 ఎకరాలు.
కర్ణాటకలో 11 ఎకరాలు (మొత్తం 33 ఎకరాలు).
మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో 3 ప్లాట్లు (మొత్తం 7 ప్లాట్లు).
₹5,00,000 నగదు, 1.6 కేజీల బంగారం, కియా సెల్టోస్, ఇన్నోవా హైక్రాస్ వాహనాలు

గురువారం దాడుల తర్వాత శ్రీనివాసులును ACB అరెస్ట్ చేసింది. ఆయనపై Prevention of Corruption Act ప్రకారం DA కేసు నమోదు చేశారు. ఆయన భూమి రికార్డుల విభాగంలో అక్రమ అనుమతులు ఇచ్చి, అవినీతి చేసినట్లు తెలుస్తోంది.

ACB ప్రజలకు "అవినీతి ఫిర్యాదులు చేయమని" సూచించింది. టోల్-ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106 లేదా అధికారిక సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా సంప్రదించవచ్చు.