Tata Motors Launches Curvv ev SeriesX in India Price Range: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో అగ్రగామి గా ఉన్న టాటా మోటార్స్, తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కర్వ్‌లో సరికొత్త 'సిరీస్ ఎక్స్' (SeriesX) మోడళ్లను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. వినియోగదారులకు తక్కువ ధరలో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అందించాలనే లక్ష్యంతో టాటా ఈ సిరీస్‌ను తీసుకువచ్చింది. అకాంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55 అనే రెండు ప్రధాన వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది.

బ్యాటరీ పవర్ , రేంజ్..
టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ లో 55 కిలోవాట్ (kWh) భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 167 హెచ్‌పి పవర్, 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫికేషన్ ప్రకారం ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 502 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రోజువారీ సిటీ డ్రైవింగ్‌తో పాటు ఊళ్లకు వెళ్లే లాంగ్ జర్నీలకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. నిజమైన డ్రైవింగ్ పరిస్థితు ల్లో ఇది దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా మొదటి ఓనర్ కోసం హై-వోల్టేజ్ బ్యాటరీపై 15 ఏళ్ల లైఫ్ టైమ్ వారంటీ ఇవ్వడం వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Also Read: టాటా సియెర్రా రీఎంట్రీ.. అదిరిపోయే డిజైన్ అండ్ పవర్ ఫుల్ ఫీచర్లు! నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా

ఇంటీరియర్ ,అదిరిపోయే ఫీచర్లు..
ఈ కారు ఇంటీరియర్ పరంగా కూడా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. 'అకాంప్లిష్డ్ ఎక్స్ 55' వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇక వెంటిలేటెడ్ సీట్లు, లెదరెట్ అప్హోల్స్టరీ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.

మరోవైపు 'ఎంపవర్డ్ ఎక్స్ 55' వేరియంట్ మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జేబీఎల్ (JBL) 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు అదనం. వెనుక సీట్లను కూడా Reclining సదుపాయం ఇందులో ఉంది. భద్రత పరంగా చూస్తే ఇందులో 'లెవల్ 2 ADAS' టెక్నాలజీ ఉంది. ఇది రోడ్డు మీద ప్రమాదాలను పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.

Also Read:  బడ్జెట్ బైకుల్లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. లాంగ్ రైడ్స్ ఇక మరింత ఈజీ! అతి తక్కువ ధరలో లభించే టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే

ధరలు మరియు వేరియంట్ల వివరాలు..
టాటా మోటార్స్ కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్‌ ను కాంపిటీటివ్ ధరల్లో తీసుకువచ్చింది.

అకాంప్లిష్డ్ ఎక్స్ 55: రూ. 16.99 లక్షలు

ఎంపవర్డ్ ఎక్స్ 55: రూ. 19.19 లక్షలు

ఎంపవర్డ్ ఎక్స్ 55 డార్క్: రూ. 19.49 లక్షలు

ఈ కొత్త వేరియంట్లు రావడం వల్ల 55 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ లుక్, ఎక్కువ రేంజ్, అధునాతన టెక్నాలజీ కోరుకునే వారికి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా టాటా వేసిన ఈ అడుగు మార్కెట్ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.