Tata Harrier EV AWD Update: టాటా మోటార్స్ నుంచి అత్యధిక ఆసక్తిని రాబడుతోన్న ఎలక్ట్రిక్ SUVల్లో Harrier EV ఒకటి. ఈ మోడల్‌లో ఉన్న QWD (Quad Wheel Drive) అని పిలిచే AWD టెక్నాలజీ ఇప్పటివరకు కేవలం టాప్ Empowered 75 వేరియంట్‌లోనే లభించేది. కానీ, కస్టమర్ల నుంచి వచ్చిన స్పందన ఊహించినదాని కంటే ఎక్కువగా ఉండటంతో, కంపెనీ ఇప్పుడు ఈ AWD సిస్టమ్‌ను మరింత తక్కువ & అఫోర్డబుల్ వేరియంట్లలో కూడా అందించడానికి సిద్ధమైంది. ఇది Harrier EV కొనాలనుకునే వారికి మంచి వార్తగా చెప్పాలి.

QWD డిమాండ్ పెరగడంతో టాటా నిర్ణయం
Harrier EV విక్రయాల్లో QWD వేరియంట్‌దే పెద్ద వాటా అని టాటా మోటార్స్ తాజాగా వెల్లడించింది. కంపెనీ CCO వివేక్ శ్రీనివాస్తా వెల్లడించిన వివరాల ప్రకారం - “మేము ఊహించినదాని కంటే QWD డిమాండ్ చాలా ఎక్కువ. Harrier EV మొత్తం సేల్స్‌లో 30 శాతం వరకూ QWD వేరియంట్ నుంచే వస్తోంది. అందుకే మేము ఈ టెక్‌ను తక్కువ వేరియంట్లలో కూడా ఇవ్వాలని నిర్ణయించాం.”

ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే, ప్రారంభంలో, AWD వేరియంట్ నుంచి కేవలం 20 శాతం సేల్స్ మాత్రమే వస్తాయని కంపెనీ అంచనా వేసింది. కానీ మార్కెట్ రెస్పాన్స్ దానిని పూర్తిగా మించడంతో, ఇప్పుడు Fearless వంటి మధ్య స్థాయి వేరియంట్లలో కూడా QWD టెక్నాలజీని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Harrier EV AWD – పవర్‌ఫుల్ స్పెక్స్
Harrier EV AWD కాన్ఫిగరేషన్‌లో రెండు ఇంజిన్లు పని చేస్తాయి - ముందు భాగంలో 158hp ఇండక్షన్ మోటార్, వెనుక భాగంలో 238hp PMS మోటార్. ఇవి కలిపి మొత్తం 313hp పవర్, 540Nm టార్క్ అందిస్తాయి. భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్‌లో ఇంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్ SUV చాలా అరుదు.

AWD వేరియంట్ పెద్ద 75kWh బ్యాటరీతో వస్తుంది. దీనికి కంపెనీ ప్రకటించిన రేంజ్ 622km. రేంజ్ విషయంలో కస్టమర్లకు చాలా పెద్ద అదనపు లాభం ఇది.

ధరలు ఎలా మారనున్నాయి?
ప్రస్తుతం టాప్ Empowered 75 QWD వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్ ధర ₹28.99 లక్షలు. తక్కువ వేరియంట్లలో QWD టెక్‌ను అందిస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. Fearless వంటి మధ్య స్థాయి ట్రిమ్‌లో QWD వస్తే, అది కొనుగోలు చేయగల కస్టమర్ల పరిధిని మరింత విస్తరిస్తుంది.

అంతేకాదు, ఇది Harrier EVనే కాదు, రాబోయే Sierra EVలో కూడా QWD టెక్ అందించడానికి కంపెనీ మరింత ధైర్యంగా ముందుకు వెళ్తోంది. ICE Sierra కూడా ఈ ARGOS ప్లాట్‌ఫామ్‌పై AWDకు సపోర్ట్ అందించగలదన్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Harrier EVలో AWD టెక్నాలజీని తక్కువ వేరియంట్లలో అందించడం మార్కెట్‌కు గేమ్ ఛేంజర్ అవచ్చు. అధిక రేంజ్‌, పవర్‌ఫుల్ డ్యూయల్ మోటార్ సెటప్‌, ప్రీమియమ్ EV ఫీల్ - ఇవన్నీ మరింత అందుబాటు ధరలో లభిస్తే, Harrier EV అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.