Tamil Nadu Floor Test: విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం.. గండం గట్టెక్కించిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు

3 weeks ago 5
ARTICLE AD
<p>తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో నెగ్గింది. విజయ్ టీవీకే పార్టీకి అన్నాడీఎంకే పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీవీకే ఎమ్మెల్యేలు 106 మంది, 5 పార్టీల మద్దతుతో పాటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యల ఓట్లు సాధించి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విశ్వాస తీర్మానాన్ని తేలికగా నెగ్గారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఈ ఓటింగ్&zwnj;ను బహష్కరించింది.</p> <p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇదివరకే మే 13న బలనిరూపణకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా విజయ్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a>, కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు విడుదలై సిరుత్తైగల్ కచ్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల మద్దతు కూటగట్టారు. ఆదివారం నాడు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. సోమవారం నాడు అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.&nbsp;&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article