తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. ఈసారి నటుడు విజయ్ పోటీ చేయడంతో ముక్కోణపు పోరును ప్రజలు చూశారు. అయితే అధికారం నిలబెట్టుకుంటామని స్టాలిన్ చెబుతుంటే, ఈసారి తమదే అధికారం అని పళనిస్వామి ధీమాగా ఉన్నారు. తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని తనకే ఓటు వేశారని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. తమిళనాడులోని ప్రముఖ అభ్యర్థులు, వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎం.కె. స్టాలిన్

డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొలత్తూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన ఓట్ల మెజారిటీపై భారీ అంచనాలు ఉన్నాయి. కొలత్తూర్ నుండి ఎంకే స్టాలిన్ నాల్గవసారి పోటీ చేశారు.

ఉదయనిధి స్టాలిన్

డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సేపాక్కం - తిరువల్లికేణి నియోజకవర్గంలో 2వ సారి బరిలోకి దిగారు. డీఎంకే ఫ్యూచర్ గా భావిస్తున్న ఉదయనిధి స్టాలిన్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం.

ఎడప్పాడి పళనిస్వామి

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి 7వ సారి ఎమ్మెల్యేగా నెగ్గుతానని భావిస్తున్నారు. ఎడప్పాడి నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేశారు.

జోసెఫ్ విజయ్

టీవీకే అధినేత, సినీ పరిశ్రమలో పేరుగాంచిన నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం, తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేశారు. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆయన తన తొలి రాజకీయ ప్రయాణాన్ని 2 చోట్ల పోటీతో ప్రారంభించారు.

సీమాన్

నామ్ తమిళర్ సమన్వయకర్త సీమాన్ ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేశారు. గతంలో తిరువొయూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన, ఈసారి కారైకుడి నుండి బరిలోకి దిగారు. కారైకుడి నియోజకవర్గంలో ఆయనకు, టీవీకే అభ్యర్థి ప్రభుకు మధ్య పోటీ నెలకొంది.

తమిళిసై సౌందరరాజన్

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్‌లో పోటీ చేశారు. తమిళిసై ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా నెగ్గలేదు. అయినప్పటికీ తమిళనాడులో ఆమెకు పేరుంది. తమిళనాడులో బీజేపీని అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఓ. పన్నీర్‌సెల్వం

జయలలితకు నమ్మకస్తుడైన మాజీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే సస్పెన్షన్ వేటు వేయడంతో పార్టీని వీడారు. తొలిసారిగా డీఎంకే నుంచి పోటీ చేశారు. అన్నాడీఎంకే నుంచి పలుమార్లు నెగ్గిన ఆయనను డీఎంకే అభ్యర్థిగా బోడినాయకనూర్ ప్రజలు మద్దతు ఇస్తారా? లేక ఓటమి పాలవుతారా అని ఉత్కంఠ నెలకొంది.

ప్రేమలత

విజయకాంత్ భార్య, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. డీఎంకే కూటమిలో భాగంగా తొలిసారిగా పోటీ చేస్తోంది డీఎండీకే పార్టీ. దివంగత నటుడు విజయకాంత్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వృద్ధాచలం నియోజకవర్గంలో ప్రేమలత పోటీ చేశారు.

శెంగోట్టైయన్

అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరిన శెంగోట్టైయన్. విజిల్ గుర్తుపై పోటీ చేశారు. 10వ సారి తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చుంటారా? లేదా అనేది మే 4న తేలనుంది.

పి. ఆనంద్

టీవీకే ప్రధాన కార్యదర్శి, విజయ్ రాజకీయాల్లోకి రావడానికి మొదట్నుంచీ సహకరించిన పి. ఆనంద్ టి.నగర్‌లో బరిలోకి దిగారు. విజయ్ లాగానే టీవీకే పార్టీలో ఫేమస్ నేతల్లో ఒకరు.

సెంథిల్ బాలాజీ

డీఎంకే మంత్రివర్గంలో ఉండాల్సిన నేతలలో సెంథిల్ బాలాజీ ఒకరు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన నియోజకవర్గం మారి కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి జోటీ చేశారు. కొంగు మండలం అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న పరిస్థితుల్లో సెంథిల్ బాలాజీ డీఎంకేకు కోటగా మార్చాలని భావిస్తున్నారు.

నయినార్ నాగేంద్రన్

అన్నామలై తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నయినార్ నాగేంద్రన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం శాతూర్. ఆయన గెలుపు అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.

లీమా రోజ్

తమిళనాడులో అత్యంత ధనవంతుడైన లాటరీ మార్టిన్ భార్య లీమా రోజ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం లాల్‌కుడి. AIADMK నుంచి పోటీ చేసిన ఆమెకు టీవీకేకు చెందిన కుబ కృష్ణన్ గట్టి పోటీ ఇచ్చారు.

ఎస్.పి. వేలుమణి

మాజీ మంత్రి, ఎడప్పాడి పళనిస్వామికి అండగా నిలిచిన నేత ఎస్.పి. వేలుమణి తొండముత్తూర్ నుంచి పోటీ చేశారు. కొంగు మండలాన్ని అన్నాడీఎంకేకు కంచుకోటగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు.

విజయ ప్రభాకరన్

డీఎండీకే మాజీ అధ్యక్షుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ విరుదునగర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. విరుదునగర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన విరుదునగర్ అసెంబ్లీ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ద్వారా ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అవుతారా ? లేదా అని విజయకాంత్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

సుందర్ సి

తమిళ సినీ దర్శకుడు సుందర్ సి సినిమాల్లో వచ్చే ట్విస్ట్ లాగా అకస్మాత్తుగా ఎన్నికల బరిలోకి దిగారు. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగడమే కాకుండా బలమైన అభ్యర్థి అయిన పిటిఆర్ పళనివేల్ త్యాగరాజన్‌కు పోటీ ఇచ్చారు.